Tollywood : పెళ్ళైన, పిల్లలు ఉన్న ఇకపై కెరీర్ కి డోకా లేదు.. మారుతున్న పోకడ

సినిమా ఇండస్ట్రీలో కొన్నేళ్లు వెనక్కి వెళితే ఎన్నో అపోహలు ఉండేవి.ఒక హీరోయిన్ కి( Heroines ) పెళ్లయితే అవకాశాలు రావు అనే భ్రమలో ఉండేవారు.

 Tollywood Makers Opnion On Married Heroines Changed-TeluguStop.com

అందుకోసం చాలా ఏళ్లకాలం పెళ్లి చేసుకోకుండా సినిమా ఇండస్ట్రీలో నటించడానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చేవారు.ఇకపై వయసు మీద పడుతుంది అవకాశాలు ఇచ్చే ఛాన్స్ లేదు అనుకున్నప్పుడు పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి ఎంటర్ అయ్యేవారు.

కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.సినిమా ఇండస్ట్రీకి వ్యక్తిగత జీవితానికి ముడిపెట్ట చూడకుండా ఉండాలని అర్థం చేసుకున్నారు ఇప్పటి తరం ప్రేక్షకులు మరియు దర్శక నిర్మాతలు( Director Producers ).పెళ్లయినా పిల్లలు ఉన్న నటిగా ఎదగడానికి లేదా నటించడానికి పొంతన ఉండదు అని అభిప్రాయానికి కూడా వచ్చారు.దాదాపుగా చాలామంది హీరోయిన్స్ పెళ్లి అయ్యాక నటిస్తున్నారు.

Telugu Anchor Ravi, Offers, Married, Pregnant, Senior, Tollywood, Tollywood Tren

మన తెలుగు సినిమా ఇండస్ట్రీ లేదా సౌత్ ఇండియా తో పోలిస్తే నార్త్ వారికి ఈ అభిప్రాయ భేదాలు అస్సలు లేవు.చాలామంది సీనియర్ హీరోయిన్స్( Senior Heroines ) ఇప్పటికి హీరోయిన్స్ గానే కంటిన్యూ అవుతున్నారు.పిల్లలు పుట్టినా కూడా వారికి హీరోయిన్ ఛాన్స్ వస్తున్నాయి.అంత ఎందుకు నిన్న మొన్న ఒక యాంకర్( Anchor ) తన గర్భవతిగా ఉన్నప్పుడు తన షో నుంచి తీసేశారు అంటూ పబ్లిక్ గా చెప్పింది.

అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు గతంలో అలాగే అనుకునేవారు.అలా ప్రెగ్నెన్సీ తో( Pregnancy ) షో చేస్తే జనాలు చూడరు అనే అపోహలో ఉండేవారు.

కానీ పరిస్థితులు సోషల్ మీడియాలో అవేర్నెస్ పెరిగిన తర్వాత అన్ని మారిపోతూ వస్తున్నాయి.ఒకదాని తర్వాత ఒకటి ప్రేక్షకులు లేదా జనాలు ఓన్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు.

Telugu Anchor Ravi, Offers, Married, Pregnant, Senior, Tollywood, Tollywood Tren

పెళ్లయితే మాత్రం ఏముంది పిల్లలు పుడితే మాత్రం వచ్చే నష్టం ఏంటి అని అనుకుంటున్నారు.ఇంకా ఒక అడుగు వెనక్కి వేస్తే కేవలం అమ్మాయిలు మాత్రమే కాదు అబ్బాయిలకు కూడా ఇదే పరిస్థితి.అందుకే యాంకర్ రవి( Anchor Ravi ) లాంటివారైతే పెళ్లి జరిగిన విషయాన్ని దాదాపు దశాబ్ద కాలం పాటు ఇండస్ట్రీకి తెలియకుండా మెయింటైన్ చేశారు.ఆడవారికి కాదు మగవారికి కూడా పెళ్లయితే అవకాశాలు రావు అనుకునే ఇండస్ట్రీలో మనం ఉన్నాం.

కానీ కాస్త కళ్ళు తెరిచి చూస్తే అన్ని అర్థమవుతాయి.మరి అంత చాదస్తం ఇప్పటి వాళ్లకు లేదు చాలా ఓపెన్ గానే విషయాలను చర్చించుకుంటున్నారు.

సో కెరియర్ కి, వయసుకి, పెళ్లికి, పిల్లలకి ముడిపెట్టి జీవితాలను నాశనం చేసుకోవద్దు.ఎందుకంటే వయసు మళ్ళిన తర్వాత పిల్లలు పుట్టాలంటే ఎంత కష్టమో అందరికి తెలుసు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube