మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్( Sukhesh Chandrasekhar ) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha ) అరెస్టుపై జైలు నుంచి లేఖ రాశారు.ఇన్నాళ్లుగా తప్పుడు ఆరోపణలు, రాజకీయ కక్ష సాధింపు అంటూ కవిత చెప్పిన మాటలు అబద్దాలని తేలిందన్నారు.
ఈ క్రమంలో కవితతో పాటు ఆమె అవినీతి సహాయకులు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్( Delhi CM Arvind Kejriwal ) చేసిన అక్రమాలు బయటపడతాయని తెలిపారు.సినిమా క్లైమాక్స్ కు చేరుకుందన్న ఆయన ఇక కేజ్రీవాల్ వంతని లేఖలో పేర్కొన్నారు.
తీహార్ జైలు క్లబ్ లో త్వరలో మీరు కూడా సభ్యులు కాబోతున్నారంటూ లేఖ రాసిన ఆయన స్వాగతం పలికేందుకు ఎదురు చూస్తుంటానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో( Delhi liquor scam case ) కవిత ఈడీ కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే.







