Belly Fat : నెలపాటు ఈ జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకున్నారంటే బాన పొట్ట దెబ్బకు మాయం అవుతుంది!

ఆడ, మగ అనే తేడా లేకుండా ఇటీవల కాలంలో బాన పొట్టతో ఎంతో మంది బాధపడుతున్నారు.ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, మద్యపానం, గంటలు తరబడి కూర్చుని ఉండటం తదితర కారణాల వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది.

 Consuming This Juice For A Month Will Melt Belly Fat-TeluguStop.com

బాన పొట్ట శరీర రూపాన్నంతా పాడు చేస్తుంది.ఈ కారణంగా చిన్న వయసులోనే పెద్ద వాళ్ళలా కనబడుతుంటారు.

పైగా బాన పొట్ట వల్ల మధుమేహం, గుండెపోటుతో సహా ఎన్నో ప్రమాదకరమైన జబ్బులు తలెత్తే అవకాశాలు పెరుగుతాయి.అందుకే పొట్ట కొవ్వు( Belly Fat )ను కరిగించుకునేందుకు నానా అవస్థలు పడుతుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ మీకు చాలా బాగా సహాయపడుతుంది.నెల పాటు ఈ జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకున్నారంటే బాన పొట్ట దెబ్బకు మాయమవుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ జ్యూస్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Telugu Belly Fat, Melt Belly Fat, Fat, Tips, Healthy, Latest-Telugu Health

ముందుగా ఒక కప్పు పైనాపిల్ ముక్కలను( Pine Apple ) కట్ చేసి పెట్టుకోవాలి.అలాగే ఒక చిన్న కీర దోసకాయ తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేయాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ ముక్కలు, కీరా దోసకాయ ముక్కలు వేసుకోవాలి.అలాగే ఒక గ్లాస్ ఫ్రెష్ కొబ్బరి నీళ్ళు( Coconut Water ) వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.

తద్వారా మన జ్యూస్ అనేది సిద్ధం అవుతుంది.ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ కు అరగంట ముందు ఈ జ్యూస్ ను తీసుకోవాలి.

Telugu Belly Fat, Melt Belly Fat, Fat, Tips, Healthy, Latest-Telugu Health

నెలరోజుల పాటు రెగ్యులర్‌గా ఈ జ్యూస్ ను కనుక తీసుకుంటే అద్భుత ఫలితాలను పొందుతారు.పైనాపిల్ కీర దోసకాయ లో ఉండే పోషకాలు పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును సమర్థవంతంగా కరిగిస్తాయి.బాన పొట్ట ను కొద్దిరోజుల్లోనే ఫ్లాట్ గా మారుస్తాయి.అలాగే కొబ్బరి నీళ్లు బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుతాయి.బెల్లీ ఫ్యాట్ సమస్యతో బాధపడుతున్న వారికి ఈ జ్యూస్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.ఈ పైనాపిల్ కీరా జ్యూస్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల వెయిట్ లాస్( Weight Loss) కూడా అవుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube