రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ఐజి రంగనాథ్ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఐజి ఆలయంలోకి రాగానే అర్చకులు స్వస్తి స్వాగతం పలికారు.
ఆలయంలో ప్రధాన మొక్కుబడి అయిన కోడె మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం స్వామి వారిని దర్శించుకొన్నారు.
ఆశీర్వచనం మండపంలో అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు.కార్యక్రమంలో ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు, ఆలయ పర్యవేక్షకులు నాగుల మహేష్, డి.ఎస్.పి నాగేంద్ర చారి, టౌన్ సిఐ కరుణాకర్, రూరల్ శ్రీనివాస్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి పవన్ తదితరులు ఉన్నారు.







