ప్రతిరోజు ప్రపంచ నలమూలల ఎలాంటి విషయాలు జరిగిన సోషల్ మీడియా పుణ్యమా అంటూ ప్రతి విషయం నిమిషాల వ్యవధిలోనే ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోతోంది.సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో ప్రతిరోజు అనేక రకాల వైరల్ వీడియోలు చూస్తూనే ఉంటాం.
ఇకపోతే తాజాగా ఓ టీచర్ ఐటమ్ సాంగ్ కు డాన్స్ వేసిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.ఎందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.
బాలీవుడ్ చిత్రం ‘బంటి అవుర్ బబ్లీ‘ సినిమాలో ఐశ్వర్యరాయ్ ఐటమ్ నటించిన ‘గజరే ‘ పాటకు ఓ టీచర్ నృత్యం చేస్తుండగా.విద్యార్థులు ఆమెను బాగా ప్రోత్సహించారు.టీచర్ డాన్స్ చేస్తున్న సమయంలోనే ఓ విద్యార్థి రెడ్ దుపట్టా ఇవ్వగా.ఆ దుప్పటి తీసుకొని మరింత ఉత్సాహంగా డాన్స్ చేసింది మహిళా ఉపాధ్యాయులు( Women teachers ) క్లాస్ రూమ్ లో విద్యార్థులు తమ ఉపాధ్యాయుల పుట్టినరోజు జరిపిన నేపథ్యంలో.
ఆ మహిళా టీచర్ డాన్స్ చేసినట్లు అర్థమవుతుంది.డాన్స్ చేస్తున్న వీడియోను గమనిస్తే వెనకాల బ్లాక్ బోర్డుపై హ్యాపీ బర్త్డే రష్మి మేడం అని రాసి ఉండడం మనం గమనించవచ్చు.
ఎది ఏమైనా మహిళా టీచర్ డాన్స్ అద్భుతం.అందుకే కాబోలు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా( Social media )లో ట్రెండింగ్ గా ఉంది.ఇక ఈ వీడియో పై నెటిజన్లు అనేక రకాలుగా స్పందిస్తున్నారు.కొందరు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి క్లాస్ రూమ్ ( Class room )లో ఇలాంటి పని ఏంటి అని అంటుండగా.
మరికొందరు విద్యార్థులతో ఇంత చనువుగా ఉండడం మంచిది కాదంటూ హితబోధ చేస్తున్నారు.