Pallavi Prashanth : ప్రజలని ఆదుకోవాలంటే నేను సీఎంని కావాలి కదా.. పల్లవి ప్రశాంత్ కామెంట్స్ వైరల్!

తెలుగు సినీ ప్రేక్షకులకు బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కామన్ మ్యాన్ క్యాటగిరిలో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అనే ట్యాగ్ తో సింపతీని సంపాదించుకుంటూ చివరిదాకా హౌస్ లో నిలబడడంతో పాటు బిగ్ బాస్ సీజన్ విన్నర్ గా కూడా నిలిచాడు.

 Pallavi Prashanth About Nagarjuna-TeluguStop.com

ఇక బిగ్ బాస్ స్టేజి మీద తనకు వచ్చి ప్రైజ్ అమౌంట్ మొత్తాన్ని కూడా పేద రైతులకు, పేద పిల్లలకు పంచిపెడతాను అని చెప్పాడు.అయితే రీసెంట్ గా కొంతమంది పేద పిల్లలకు తన తరపున ఒక లక్ష రూపాయలను శివాజీ చేతులమీదుగా ఇప్పించాడు.

Telugu Bigg Boss, Nagarjuna-Movie

అలాంటి పల్లవి ప్రశాంత్ కి బిగ్ బాస్ హౌస్( Bigg Boss House ) లోకి వెళ్ళగానే హోస్ట్ నాగార్జున ఒక మిర్చి మొక్కను ఇచ్చారు.ఐతే దాన్ని సరిగా చూసుకోకపోయేసరికి నాగార్జునకు కోపం వచ్చింది.ఆ తర్వాత ప్రశాంత్ మరో మొక్కను కూడా ఇచ్చారు.దాన్ని ఇంటికి తెచ్చి పూజలు అవి చేసి సోషల్ మీడియాలో కొంచెం హంగామా చేసిన విషయం తెలిసిందే.

దీని గురించి ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను చెప్పాడు.అప్పుడు చాలా గొడవలు అవీ జరిగాయి కదా నేను ఆ మొక్కను ఒక చోట పెట్టాను.

ఆ టైములో బాగా డామేజ్ ఐపోయింది.నేను జైల్లో ఉన్నప్పుడు ఆ మొక్కను ఎవరూ సరిగా చూసుకోలేదు.

Telugu Bigg Boss, Nagarjuna-Movie

మొక్క చచ్చిపోయింది కానీ ఆ మట్టిని దాచాను.అలాగే నేను కూడా నాగార్జున ( Nagarjuna ) సర్ కి ఇచ్చాను.దాన్ని ఆయన పట్టుకెళ్లి ఇంట్లో మొక్కల్లో జల్లుతానని చెప్పారు.ఐతే మట్టిని తీసుకెళ్లారా అని నాగార్జున గారిని నేను మళ్ళీ అడగలేదు.బిగ్ బాస్ హౌస్ మనకు బతుకును నేర్పిస్తుంది.జనాల ఆశీస్సులతో పార్లమెంట్ కి, అసెంబ్లీకి కూడా అవకాశం వస్తే వెళ్తాను.

అల్లు అర్జున్ ( Allu Arjun )గారిని ఏదో ఒక టైములో కలుస్తాను.కొంతమందిని అడిగాను ఆయనతో కల్పించమని.

కానీ ఎవరూ సాయం చేయలేదు.నేను 14 మండలాల ప్రజల్ని ఆదుకోవాలి అంటే సీఎంని కావాలి కదా.నా దగ్గర డబ్బులు ఏమీ ఎక్కువ లేవు.పెయిడ్ ప్రమోషన్స్ చేయించుకోవడానికి అని చెప్పాడు పల్లవి ప్రశాంత్.

అయితే కొందరు పల్లవి ప్రశాంత్ కామెంట్స్ పై పాజిటివ్ గా స్పందిస్తుండగా మరికొందరు నెగిటివ్గా స్పందిస్తున్నారు.డబ్బులు చేతిలోకి రాగానే అప్పుడు ఈ ఆటిట్యూడ్ చూపిస్తున్నావా అంటూ మండిపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube