US Dollar General Store : యూఎస్ స్టోర్‌కు షాక్ ఇచ్చిన ఉద్యోగులు.. ఒకేసారి పని మానేశారు..?

ఇటీవల యూఎస్ రాష్ట్రమైన విస్కాన్సిన్‌లో ఓ “డాలర్ జనరల్ స్టోర్‌”( Dollar General Store )కు ఉద్యోగులందరూ కలిసి షాకిచ్చారు.వారు ఒకేసారి ఉద్యోగం మానేయడంతో స్టోర్ కాసేపు క్లోజ్ చేయాల్సి వచ్చింది, మేనేజర్‌తో సహా బృందం అనేక కారణాల వల్ల వారి ఉద్యోగాలపై అసంతృప్తిని పెంచుకున్నారు.

 Dollar General Store Closes After Entire Staff Quits-TeluguStop.com

వారం రోజుల పాటు పనిచేసి అలసిపోయామని, తమ కష్టాన్ని ఎవరూ మెచ్చుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.వారు చాలా కాలంగా ఉద్యోగాల నుంచి వైదొలగడం( Resignation ) గురించి ఆలోచిస్తున్నారు.

చాలా కఠినమైన వారం తర్వాత, వారు బయలుదేరాలని నిర్ణయించుకున్నారు.తమ కస్టమర్లకు వీడ్కోలు చెప్పేందుకు స్టోర్ డోర్‌పై ఒక నోట్‌ను ఉంచారు, వారు ఎందుకు వెళ్లిపోతున్నారో ఆ నోట్‌లో వివరించారు.

ఇంకా ఉపయోగించడానికి మంచివిగా ఉన్న ఆహారాన్ని, ఇతర వస్తువులను ఈ స్టోర్ పారేయడానికే మొగ్గు చూపుతుందని, అవసరమైన వ్యక్తులకు ఆ వస్తువులను ఇవ్వడం స్టోర్ యజమానులకు అసలు ఇష్టం లేదని ఉద్యోగులు( Employees ) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.ఆకలితో ఉన్న పిల్లలకు కాఫీ, తృణధాన్యాలు వంటి మంచి ఆహారాన్ని అందజేయకుండా వాటిని పారేయడం విచారకరమని మేనేజర్ అన్నారు.క్రిస్మస్ నుంచి విరామం లేకుండా పని చేయడం వల్ల మేనేజర్ చాలా ఒత్తిడికి గురయ్యారట.ఆమె కొత్త ఉద్యోగాన్ని కనుగొనే ముందు విశ్రాంతి తీసుకోవాలనుకుంటోంది, కానీ ఇతర కార్మికులు కొత్త ఉద్యోగాలలో( New Jobs ) వెంటనే చేరుకోవడానికి రెడీ అయ్యారు.

డాలర్ జనరల్ వంటి దుకాణాల్లో పనిచేసే వ్యక్తులు కఠినమైన పరిస్థితులు( Critical Situations ) ఎదుర్కొంటున్నారని ఈ సంఘటన చెప్పకనే చెబుతోంది.

వారు తగినంత జీతం కూడా పొందడం లేదు.విస్కాన్సిన్‌లోని ఆ దుకాణం మళ్లీ తక్కువ సమయంలోనే ఓపెన్ అయ్యింది, ఎందుకంటే వారు త్వరగా కొత్త కార్మికులను కనుగొన్నారు.ఈ స్టోర్‌లోని కార్మికులకు ఎంత చెల్లించారో తెలియ రాలేదు, అయితే విస్కాన్సిన్‌లో ఒక కార్మికుడు పొందగలిగే అతి తక్కువ మొత్తం గంటకు $7.25, అంటే దాదాపు 600 భారతీయ రూపాయలు.దీంతో కూలీలకు సక్రమంగా జీతాలు( Salaries ) అందడం లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.ఈ లింక్‌ https://www.facebook.com/share/p/LMG9QorkWhwbQMni/?mibextid=oFDknk పై క్లిక్ చేయడం ద్వారా ఈ ఉద్యోగులకు సంబంధించిన పిక్స్ చూడవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube