టిడిపి, జనసేన, బిజెపిలు కూటమిగా ఏర్పడి వైసిపిని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాయి.కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ కూడా నిన్ననే విడుదల చేసింది .
దీంతో అన్ని రాజకీయ పార్టీలు అలెర్ట్ అయిపోయాయి.పూర్తిగా ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించాయి.
దీనిలో భాగంగానే ఈరోజు పల్నాడు జిల్లాలో టిడిపి , జనసేన, బిజెపిలు ఉమ్మడిగా ప్రజాగళం( Prajagalam ) పేరుతో సభను ఏర్పాటు చేసుకుని భారీగా ఏర్పాట్లు చేశాయి.ఈ సభ నుంచి ఎన్నికల శంఖారావం పూరించబోతున్నాయి.
ఈ సభను బిజెపి టిడిపి, అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో,
అంతే స్థాయిలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ సభ ద్వారానే మూడు పార్టీలు కలిసి అధికారంలోకి వస్తే ఏపీ ఏ స్థాయిలో అభివృద్ధి చేస్తామనే విషయాన్ని చెప్పబోతున్నారు.
ఇక ఈ సభకు ప్రధాని నరేంద్ర మోది( PM Narendra Modi ) కూడా హాజరుకాబోతూ ఉండడం తో ఈ సభ పై భారీ అంచనాలే ఉన్నాయి.సాధారణంగానే పవన్ చంద్రబాబు పూర్తిగా జగన్ ను( Jagan ) టార్గెట్ చేసుకునే ఈ సభలో ప్రసంగించనున్నారు.

నరేంద్ర మోది సైతం జగన్, వైసీపీని టార్గెట్ చేసుకుని విమర్శలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొన్నటి వరకు కేంద్రానికి అన్ని విధాలుగా జగన్ సహకారం అందించారు .అంతే స్థాయిలో జగన్ ప్రభుత్వానికి కేంద్ర నుంచి సాయం అందేది .జగన్ తో ప్రధాని నరేంద్ర మోదీ కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు టిడిపి, జనసేనతో పొత్తు( TDP Janasena Alliance ) పెట్టుకోవడంతో, జగన్ వైసీపీలు ప్రత్యర్థులుగా మారారు.దీంతో వైసీపీ పైన జగన్ పైన తప్పనిసరిగా ప్రధాని విమర్శలు చేయాల్సి ఉంటుంది .అయితే ఏ స్థాయిలో విమర్శలు చేస్తారనేది తేలాల్సి ఉంది.

ముఖ్యంగా ఏపీలో అభివృద్ధి( AP Development ) జరగలేదని, రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు కూడా ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని, కేంద్రం అందిస్తున్న వివిధ పథకాలను వైసిపి ప్రభుత్వం తమవి గా చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తుందని ఇలా ఎన్నో అంశాలపై ప్రధాని ని మాట్లాడే అవకాశం కనిపిస్తుంది.మొదటిసారిగా జగన్ ను టార్గెట్ చేసుకుని ప్రధాని నరేంద్ర మోది విమర్శలు చేసే అవకాశం ఉండడంతో, ఈ మూడు పార్టీల ఉమ్మడి సభ పైనా , ప్రధాని నరేంద్ర మోది ప్రసంగం పైన అందరిలోనూ ఆసక్తి నెలకొంది.







