రేణు దేశాయి ( Renu Desai )పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు అయితే సంపాదించుకున్నారు.పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )ఇద్దరు బిడ్డల తల్లిగా రేణు దేశాయ్ ఇప్పుడు ఒంటరిగానే జీవిస్తోంది.
అయితే వీరికి విడాకులు జరిగే చాలా ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికి పవన్ కళ్యాణ్ భార్య అంటే రేణు అని అందరు అంటారు.ఇక రేణు దేశాయ్ ఐదేళ్ల క్రితం మరో మారు వైవాహిక జీవితంలో అడుగు పెట్టాలనుకున్నారు.
అలా అనుకోవడంతో పాటు ఆమెకు మరోమారు నిశ్చితార్థం కూడా జరిగింది అని కూడా అందరికీ తెలిసిన విషయమే.అయితే కొన్ని కారణాల వల్ల ఇది ముందుకు వెళ్లలేదు అనేక సార్లు మీడియా ముందు ఆ ప్రస్తావన వచ్చిన రేణు సున్నితంగా తప్పించుకునే ప్రయత్నం చేశారు.

అయితే ఇటీవల ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ తన రెండవ పెళ్లికి ( second marriage )సంబంధించిన వివరాలను పూర్తిగా బయటపెట్టారు.తాను మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకున్న మాట నిజమే అని, కానీ అందుకు తన కూతురు చిన్న వయసు అమ్మాయి కావడంతో పెళ్లి చేసుకోవాలా, వద్దా అనే సందిగ్ధం లో పడ్డారని తెలిపారు.ఏడేళ్ల వయసులో తన కూతురు చిన్న ఉన్న సమయంలో నిశ్చితార్థం జరిగిందని, ఇప్పుడు తనకు 12 ఏళ్లు అని, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మనం చేసే పని వారు పెద్దయ్యాక వారి జీవితాల్లో ఎలాంటి మార్పులను తీసుకువస్తుందో అనే భయంతో రెండవ పెళ్లికి సంబంధించిన వ్యవహారాన్ని పక్కన పెట్టినట్టుగా చెప్పింది.

అంతే కాదు తన నిశ్చితార్థం పూర్తిగా పెద్దల నిర్ణయమే అని తాను జీవితంలో ఒకసారి ప్రేమలో పడ్డానని అదే చివరి సారి అంటూ రేణు దేశాయ్ స్పష్టం చేశారు.ఇక ఆమె జీవితంలో మరో పెళ్లి ఉండబోదని తన పిల్లలు తన జీవితం అంటూ చెప్పుకొచ్చారు.ఈ విషయాన్ని తాను రెండో పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తితో కూర్చుని నిర్ణయించుకున్నట్టు, తనకు విషయాన్ని పూర్తిగా అర్థమయ్యేలా చెప్పడంతో ఆయన కూడా ఒప్పుకున్నట్టు తెలిపారు.
కేవలం స్నేహితులు, బంధువులు, ఫ్యామిలీ మెంబర్స్ ఒత్తిడి చేయడంతో రెండవ పెళ్లి గురించి ఆలోచించానని కానీ ఇకపై ఆ ఛాన్స్ లేదంటూ తెలుపుతున్నారు.







