Hanuman Movie : హనుమాన్ స్ట్రీమింగ్ లేట్ కావడానికి అసలు కారణాలివే.. డబ్బులు సరిపోలేదా అంటూ ట్రోల్స్ చేస్తూ?

టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ,( Prasanth Varma ) యంగ్ హీరో తేజ సజ్జా( Teja Sajja ) కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం హనుమాన్.( Hanuman Movie ) ఈ ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది.

 Trolling On Hanuman Director Prashanth Varma-TeluguStop.com

చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా దాదాపుగా 400 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించింది.ఈ సినిమా ఏ ముహూర్తాన విడుదల అయిందో కానీ అప్పటి నుంచి ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ భారీగా కలెక్షన్లను సాధిస్తోంది.

రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకొని అందరి చేత శబాష్ అనిపించుకుంది.

కాగా ఈ సినిమాను కన్నడ తమిళం హిందీ మలయాళ భాషల్లో కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.

అన్ని భాషల్లో ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.అంతేకాకుండా పాన్ ఇండియా లెవెల్లో కలెక్షన్ల సునామీని సృష్టించింది హనుమాన్.అయితే ఇప్పటికే థియేటర్లో ఒక్కసారి ఈ సినిమాలో చూసిన ప్రేక్షకులు ఓటీటీ లో( OTT ) చూడడం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.అయితే ఈ విషయంలో ప్రేక్షకులకు నిరాశ ఎదురవుతోంది.

ఈ సినిమా విడుదల అవుతుంది అనుకున్న కొద్ది ఆలస్యం అవుతూనే ఉంది.ఈ విషయంపై ప్రశాంత్ వర్మ స్పందిస్తూ.

ది బెస్ట్ ఔట్ పుట్ కోసం కష్టపడుతున్నాం, అందుకే వాయిదా వేశాం, వెయిట్ చేయండి అంటాడు.

Telugu Prasanth Varma, Hanuman, Hanuman Ott, Prasanthvarma, Prashanth Varma, Tej

ఈ డైలాగ్ ను ఇప్పటికే ఎన్నోసార్లు వాడేశాడు ప్రశాంత్ వర్మ.హనుమాన్ సినిమాను ఎప్పటికప్పుడు వాయిదా వేయడం ఈ డైలాగ్ కొట్టడం అతడికి కామన్ అయిపోయింది.దీంతో ఈ డైలాగు విని విని ప్రేక్షకులు విసిగిపోయారు.

సినిమా థియేట్రికల్ రన్ ముగిసి, ఓటీటీలోకి రాబోతున్న టైమ్ లో కూడా ప్రశాంత్ వర్మ ఇంకా ఈ డైలాగ్ వదల్లేదు.కాగా లెక్క ప్రకారం ఈపాటికి హనుమాన్ సినిమా ఓటీటీలోకి రావాలి, ఇదిగో వస్తోంది అదిగో వస్తోంది అంటూ రోజులు గడిపేస్తున్నారు.

తాజాగా మరోసారి ఓటీటీ ప్రేక్షకులకు ఆశాభంగం ఎదురైంది.సరిగ్గా ఇలాంటి టైమ్ లో ప్రశాంత్ వర్మ ట్వీట్ పెట్టాడు.

Telugu Prasanth Varma, Hanuman, Hanuman Ott, Prasanthvarma, Prashanth Varma, Tej

ది బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నామని, దయచేసి అర్థం చేసుకొని ఓపిక వహించాలంటూ పోస్ట్ పెట్టాడు.దీంతో నెటిజన్లకు మండింది.ఒక రేంజ్ లో ఈ డైరక్టర్ పై విరుచుకుపడుతున్నారు.విడుదలకు ముందు అదే మాట, రిలీజ్ తర్వాత కూడా అదే డైలాగా అంటూ సెటైర్లు వేస్తున్నారు.ఆల్రెడీ థియేటర్లలోకి వచ్చిన సినిమాకు, ఇంకా ది బెస్ట్ ఇవ్వడానికి ఏం ఉంటుందంటూ మరో నెటిజన్ పోస్ట్ పెట్టాడు.థియేట్రికల్ నుంచి వచ్చిన డబ్బులు ఇంకా సరిపోలేదా అంటూ ఒకరు కామెంట్ చేస్తే మరోసారి వాయిదా పడినప్పుడు డైలాగ్ మార్చమని మరొకరు పంచ్ వేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube