టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాలకృష్ణ ప్రస్తుతం వరుసగా సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.
కాగా బాలయ్య బాబు చివరగా భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.
దాంతో ఇప్పుడు అదే ఊపుతో బాలయ్య బాబు వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడపడంతో పాటు ఈ తరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు.
ఇది ఇలా ఉంటే బాలయ్య బాబు ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో( Director Bobby ) ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాకు ఇంకా టైటిల్ ని ఫిక్స్ చేయలేదు.కాగా ఇటీవల శివరాత్రి సందర్భంగా ఈ చిత్రం కి సంబందించిన ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా, ఆడియెన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
వీడియోలో నందమూరి బాలకృష్ణ డైలాగ్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి.ఈ చిత్రం కి సంబందించిన విజువల్స్ ను కొన్ని చూసా అని ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న థమన్( Thaman ) అన్నారు.
ఇందులో మ్యూజిక్ ఒక రేంజ్ లో ఉండబోతుంది అని చెప్పుకొచ్చారు థమన్.
ఈ సందర్భంగా థమన్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ చిత్రానికి విజయ్ కార్తిక్ సినిమాటో గ్రాఫర్ గా పని చేస్తున్నారు.బ్రో, విజయ్ కార్తిక్, ఇప్పుడే కొన్ని రషెస్ చూసాను.NBK109 విజువల్ ట్రీట్ అంటూ చెప్పుకొచ్చారు.బాబీ డియోల్( Bobby Deol ) విలన్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్, షైన్ టామ్ చాకో లు కీలక పాత్రల్లో నటిస్తుండగా, దుల్కర్ సల్మాన్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు.
ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.