Lucknow Super Giants : ఈ ఐపిఎల్ లో లక్నో టీమ్ ను గెలిపించేది వీళ్లేనా..?

ఇక మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ సీజన్ 17 ( IPL Season 17 )స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో అన్ని టీమ్ ల్లో ఉన్న ప్లేయర్ల యొక్క ప్లస్ లు, మైనస్ లు ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తూ వస్తున్నారు.ఎవరు ఏ పిచ్ లా మీద ఎలా ఆడుతారు దాన్ని బట్టి ఏ మ్యాచ్ లో ఎవరిని తీసుకోవాలి అనే ప్రణాళికలను రెడీ చేసుకుంటున్నారు.

 Are They The Ones Who Will Win The Lucknow Team In This Ipl-TeluguStop.com

ఇక ఇదిలా ఉంటే లక్నో సూపర్ జాయింట్స్( Lucknow Super Giants ) టీం మీద ఇప్పుడు భారీ అంచనాలైతే ఉన్నాయి.

ఎందుకంటే గత రెండు సీజన్ లలో ఈ టీమ్ సెమీఫైనల్ కి వచ్చినప్పటికీ, ఫైనల్ కి మాత్రం చేరుకోలేకపోయింది.ఈసారి ఎలాగైనా సరే కప్పు కొట్టాలనే ఉద్దేశ్యంతోనే ఈ టీమ్ బరిలోకి దిగబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇంక దానికి తగ్గట్టుగానే కెప్టెన్ కే ఎల్ రాహుల్( KL Rahul ) మీద అతి పెద్ద బాధ్యత అయితే ఉంది.

ఆయన కనక ఈసారి కప్పు కొట్టకపోతే కెప్టెన్ గా తప్పుకునే అవకాశాలు కూడా ఉన్నాయి.ఇక ఇలాంటి సమయంలో ఈ టీమ్ ను విజయ తీరాలకి చేర్చే ప్లేయర్లు ఎవరు అనే దానిమీద కూడా సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది.

ఇక బ్యాటింగ్ విషయానికస్తే కేఎల్ రాహుల్, నికోలస్ పూరాన్, కైయిల్ మేయర్స్ లాంటి ప్లేయర్లు ఈ టీంలో కీలక పాత్రను వహించబోతున్నారు.

అలాగే బౌలర్ల విషయానికి వస్తే మార్క్ వుడ్, డివైడ్ విల్లీ లు మ్యాచ్ విజయం లో కీలక పాత్ర వహించబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ప్రత్యర్థి బ్యాట్స్మెన్లను కట్టడి చేయడంలో ఈ బౌలర్లు రాణిస్తే గాని టీం కి విజయాలైతే రావు.కాబట్టి వీళ్ళు అత్యంత ప్రభావంతమైన బౌలింగ్ ను ప్రదర్శననిస్తే తప్ప లక్నో టీం విజయం అనేది అంత ఈజీగా అయితే రాదు.

ఇక ఈ క్రమం లో ఈ టీమ్ ఎలాంటి ప్రణాళికలను రెడీ చేస్తూ బరిలోకి దిగుతుంది అనేది కూడా ఇప్పుడు తెలియాల్సి ఉంది…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube