బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ( MLC Kavitha )అరెస్ట్ అయ్యారు.ఈ మేరకు కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు( Delhi Liquor Scam Case )లో కవితకు సెర్చ్ వారెంట్ తో పాటు అరెస్ట్ వారెంట్ ను అధికారులు జారీ చేశారు.దాదాపు మూడు గంటలకు పైగా కవిత నివాసంలో ఐటీ మరియు ఈడీ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఆమెను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.
మరోవైపు కవిత నివాసం వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు.ఈ క్రమంలోనే ఈడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో కవిత నివాసం వద్ద హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.