సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎవరో ఒకరి వీడియో వైరల్ అవుతుంది.కొన్ని వీడియోలు( Videos ) చూడగానే మనకు నవ్వు వస్తాయి.
కానీ ఇంకొన్ని వీడియోలు చూడగానే బాధ కలుగుతుంది.ఇదే కోవలో ఢిల్లీలో వడ పావ్ అమ్మాయిగా ఫేమస్ అయిన యువతి ఏడుస్తున్న వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో బాగా వైరల్ అవుతోంది.
ఇందులో ఆమె ఏడుస్తూ వడ పావ్( Vada Pav ) అమ్ముతూ కనిపించింది.వీడియోలో, ఆమె ఏడుస్తూ తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తుంది.
ఢిల్లీలో ఆ మహిళ తన భర్తతో కలిసి వడ పావ్‌ను విక్రయిస్తోంది.వడా పావ్ అమ్ముతున్న మహిళ పేరు చంద్రికా గేరా దీక్షిత్.
ఇంతకు ముందు ఆమె ఒక ఫుడ్ కంపెనీలో పనిచేసేది.కొడుకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఉద్యోగం మానేసింది.
తానే సొంతంగా వ్యాపారం చేయాలని భావించింది.తర్వాత ఆమె ఇప్పుడు ఢిల్లీలో తన భర్తతో కలిసి వడ పావ్‌ను విక్రయిస్తోంది.
ఆమె భర్త కూడా ఉద్యోగం మానేశాడు.తనకు వంట చేయడం అంటే ఇష్టమని చంద్రికా గేరా తెలిపింది.
దీంతో ఆయన వడ పావ్ స్టాల్‌ను ప్రారంభించారు.

చంద్రిక మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నివాసి.ముంబైలోని వడ పావ్‌ను ఢిల్లీ ప్రజలకు అందించాలని ఆమె భావించింది.గత కొన్ని రోజులుగా ఆమె వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అందులోని ఒక వీడియోలో ఆమె ఏడుస్తూ కనిపించింది.ఏడ్వడానికి గల కారణాన్ని వివరించింది.
మున్సిపల్ కార్పొరేషన్ అధికారి తన స్టాల్‌ను మూసేయాలని ఆదేశించినట్లు ఆమె రోదిస్తూ తెలిపింది.తన వడ పావ్ స్టాల్‌ను తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
ఆ మహిళ తన భర్తతో కలిసి ఈ పని చేస్తోంది.ఆమె గురించి సోషల్ మీడియాలో కొన్నాళ్ల క్రితం బాగా వైరల్ అయింది.
చాలా మంది వడాపావ్ తినేందుకు ఆమె స్టాల్‌కు వస్తున్నారు.పెద్ద పెద్ద లైన్లలో బారులు తీరి నిల్చుంటున్నారు.
వడా పావ్ తినేందుకు గంటల తరబడి నిరీక్షిస్తున్నారు.అంతకు ముందు ఆమె హల్దీరామ్‌లో పనిచేసేది.
అయితే సొంత వ్యాపారం ప్రారంభించి, తన కాళ్లపై తాను నిలదొక్కుకోవాలని తలంచింది.

వెంటనే భర్తతో కలిసి ఓ స్టాల్ పెట్టింది.కొన్నాళ్లకే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎక్కువ మంది రావడం ప్రారంభించారు.దీంతో ఆ ప్రాంతంలో విపరీతంగా రద్దీ ఏర్పడింది.
ఆ కారణంగానే స్టాల్ తీసేయాలని కార్పొరేషన్ అధికారులు ఆమెను ఆదేశించారు.తన ఉపాధి పోతుందనే బాధతో ఆమె ఏడ్చింది.
ఇలాంటి చిన్న వ్యాపారుల పొట్ట కొట్టొద్దని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.అధికారులు సహృదయతతో ఆలోచించి, ఆమె ఉపాధిని కొనసాగించుకోవ్వాలని కోరుతున్నారు.








