జపాన్( Japan )లో నిర్మించిన ఓ మ్యూజియం ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ నోరెళ్ల బెట్టేలా చేస్తోంది.ఈ మ్యూజియంలో అందమైన పురాతన వస్తువులు అంటూ ఏమీ ఉండవు.
ఓన్లీ మల విసర్జనను పోలిన వస్తువులు మాత్రమే ఇందులో ఉన్నాయి.అవును, మీరు చదివింది నిజమే.
ఈ స్థలాన్ని ఉంకో మ్యూజియం అని పిలుస్తారు.ఇది టోక్యోలోని ఒడైబా ద్వీపం( Odaiba Island )లో ఉంది.“ఉంకో” అంటే జపనీస్ భాషలో “పూప్”( Poop ) అని అర్ధం, ఈ మ్యూజియం ఫన్నీ, బ్యూటిఫుల్ గా ఉంటుంది.తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ మ్యూజియంకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు.
అందులో మ్యూజియం కలర్‌ఫుల్ డిజైన్‌తో ఉండటం కనిపించింది.ఈ మ్యూజియాన్ని ఓ బ్లాగర్ అన్వేషిస్తోంది.

వీడియో ప్రారంభంలో మ్యూజియం ఎంట్రన్స్ వద్ద వద్ద టాయిలెట్ సీట్ కవర్‌తో స్వాగతం పలకడం చూడవచ్చు.లోపల మార్ష్‌మాల్లోలు, క్యాండీలు, కేకులు, బుట్టకేక్‌లు వంటి అన్ని రకాల తీపి వంటకాలను ఉన్నాయి, కానీ అవన్నీ మలం ఆకారంలో ఉంటాయి.లైట్ షో, గేమ్‌లు కూడా ఉన్నాయి, అన్నీ పూప్ చుట్టూనే ఉంటాయి.మొత్తం ప్రదేశాన్ని ప్రకాశవంతమైన, పాస్టెల్ రంగులలో పూప్-ఆకారపు వస్తువులతో డెకరేట్ చేశారు.ఆన్‌లైన్‌లో ఉన్న వ్యక్తులు ఈ మ్యూజియం చూసి అబ్బురపడ్డారు.“ఇది ఎందుకు కట్టారు? జపాన్ ఈ ప్రత్యేకమైన మ్యూజియంతో ముందంజలో ఉండాలనుకుంటుందా?” అని కొందరు జోక్ చేస్తారు.దీని జీవితంలో ఒక్కసారైనా తాము విసిట్ చేస్తామని మరికొందరి పేర్కొన్నారు.

ఉంకో మ్యూజియం( Unko Museum ) మార్చి 2019లో యోకోహామాలో తాత్కాలిక పాప్-అప్ గ్యాలరీగా( Pop Up Gallery ) ప్రారంభమైంది.ఇప్పుడు ఇది ఎంతగానో పాపులర్ పొందింది, ఆరు నెలల తర్వాత, వారు టోక్యోలో శాశ్వత స్థలాన్ని తెరవాలని నిర్ణయించుకున్నారు.ప్రదర్శనశాలల నుంచి ఆకర్షణల వరకు మ్యూజియంలోని ప్రతి దాన్ని “మాక్స్ ఉంకో కవాయి” అనే థీమ్‌ను అనుసరించి సూపర్ క్యూట్‌గా రూపొందించారు.







