Chandrababu Naidu : సీనియర్లను దూరం పెట్టింది ఆయన కోసమేనా బాబు ? 

టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) టిక్కెట్ల కేటాయింపు విషయంలో అన్ని మొహమాటలను పక్కన పెట్టేసినట్టుగానే అర్థమవుతుంది.పార్టీలో సీనియర్ నేతలకు చాలామందికి ఈసారి టికెట్ దక్కకపోవడం , కొత్తవారికి , యువకులకు ఎక్కువ సీట్లు కేటాయించడం వంటివి చర్చనీయాశంగా మారాయి.

 Chandrababu Naidu Kept Tdp Senior Leaders Aside For Nara Lokesh-TeluguStop.com

పార్టీలో తాము సీనియర్లమని,  టికెట్ తమకు ఖాయం అనే నమ్మకంతో ఉన్న సీనియర్ నేతలు( TDP Senior Leaders ) చాలామందికి చంద్రబాబు విడుదల చేసిన జాబితా కంగు తినిపించింది.అయితే చంద్రబాబు ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి వెనుక కారణాలు చాలానే ఉన్నాయి.

రాబోయే రోజుల్లో లోకేష్ కు( Lokesh ) పార్టీలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకే ఈ విధంగా సీనియర్లను పక్కన పెట్టారనే ప్రచారం జరుగుతోంది.ప్రస్తుతం విడుదల చేసిన జాబితాలో ఎక్కువ మంది కొత్తవారు , యువకులే ఉన్నారు.

  సీనియర్ లీడర్లలో కొంతమంది నేతల కుమారులు,  కుమార్తెలు ,కోడళ్ళ కి అవకాశం కల్పించారు .ఇదంతా లోకేష్ ను దృష్టిలో పెట్టుకుని ఆయన రాజకీయ భవిష్యత్తుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసేందుకే చంద్రబాబు సీనియర్లను పక్కన పెట్టారని పార్టీలో ప్రచారం జరుగుతోంది .

Telugu Ap, Chandrababu, Devineni Uma, Janasena, Kala Venkatrao, Lokesh, Pallerag

అదీ కాకుండా సీనియర్ల రాజకీయం ప్రజలకు మోహమొత్తడం, గతంలో వారు వరుసగా గెలిచినా,  ఇప్పుడు గెలిచే పరిస్థితి లేకపోవడం, రాజకీయ ప్రత్యర్థులతో పోటీ పడలేకపోవడం , సర్వే నివేదికలు ఇలా అన్నిటిని పరిగణలోకి తీసుకునే చంద్రబాబు ఈ స్థాయిలో నిర్ణయాలు తీసుకున్నారు.పేరుకు సీనియర్లైన , ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి వారు పెద్దగా ఉపయోగపడకపోవడం, వారిపై గతంలో ఉన్న ఆరోపణలు ,రాజకీయ ప్రత్యర్థులకు వరంగా మారే అవకాశం ఉండడం ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నారు.

Telugu Ap, Chandrababu, Devineni Uma, Janasena, Kala Venkatrao, Lokesh, Pallerag

బండారు సత్యనారాయణమూర్తి ,( Bandaru Satyanarayana Murthy ) దేవినేని ఉమా,( Devineni Uma ) కళా వెంకట్రావు , గంటా శ్రీనివాసరావు,  పల్లె రఘునాథ్ రెడ్డి వంటి వారిని మొహమాటం లేకుండా పక్కన పెట్టేసారు.అయితే వారు అసంతృప్తికి గురవకొండ పార్టీ అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పదవులు ఇస్తామని భరోసా ఇచ్చారు.సీనియర్లలో కొంతమంది గెలిచినా టిడిపి ప్రభుత్వం ఏర్పడితే మంత్రి పదవులు విషయం తో పాటు ,పార్టీ వ్యవహారాల్లో ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తారని లోకేష్ ను లెక్క చసే పరిస్థితి ఉండదని ఇవన్నీ అంచనా వేసే బాబు సీనియర్ల విషయంలో కఠన నిర్ణయాలు తీసుకున్నట్లుగా అర్థమవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube