యాదాద్రి భువనగిరి జిల్లా:ఇటీవల యాదాద్రి ఆలయ బ్రహ్మోత్సవాలకు( Yadadri Brahmotsavam ) హాజరైన
సీఎం,డిఫ్యూటీ సీఎం మంత్రుల బృందానికి ఆలయం అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని, డిఫ్యూటీ సీఎం భట్టి,( Mallu Bhatti Vikramarka ) దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు చిన్న పీటలు,మిగతా వారికి పెద్ద పీటలు వేసి అవమానించారని మొదలైన జగడం చివరికి ఆలయ ఇంచార్జీ ఈవో రామకృష్ణారావుకు మెడకు చుట్టుకుంది.
ఆలయ ఈవోనిర్లక్ష్యం కారణంగానే వివాదం ఏర్పడిందని భావించిన దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆయనపై గురువారం బదిలీ వేటు వేసింది.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క( Deputy CM Bhatti Vikramarka )కు చిన్నపీట వేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారమే చెలరేగిన విషయం తెలిసిందే.ఈ విషయంపై దేవాదాయ ధర్మదాయ శాఖ సీరియస్ అయినట్లు సమాచారం.
బదిలీ అయిన రామకృష్ణారావు స్థానంలో నూతన ఈవోగా ఇటీవల ఎన్నికల సంఘం చేత సస్పెండ్ అయిన యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు (రెవిన్యూ) కలెక్టర్ భాస్కర్ రావును నియమించారు.పనిలో పనిగా వివాదానికి కారణమైన యాదగిరిగుట్ట ఆలయ పీటలను పక్కన పెట్టి,ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దేవస్థాన అధికారులు కొత్తగా సమాంతర పీటలు కొనుగోలు చేశారు.
ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఈ పీటలను వాడుకలోకి తీసుకురానున్నట్లు దేవస్థాన అధికారులు తెలిపారు.