సూర్యాపేట జిల్లా:కేంద్ర ప్రభుత్వం రైతులు( Farmers ) పండించిన పంటలకు గ్యారంటీ చట్టం చేయాలని,స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలని, రైతాంగ ఉద్యమం సందర్భంగా రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లు నాగార్జున రెడ్డి, ఏఐకేఎంఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్, రైతు సంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి దొడ్డ వెంకటయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గురువారం సంయుక్త కిసాన్ మోర్చ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరుగుతున్న రైతాంగ ఉద్యమానికి మద్దతుగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఢిల్లీలో సంవత్సర కాలానికి పైగా జరిగిన రైతాంగ ఉద్యమం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీని అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు.స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేస్తామని చెప్పి పట్టించుకోవడం లేదన్నారు.
దేశ వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడం కోసం దేశ రాజధాని ఢిల్లీలో రైతులు ఉద్యమాలు నిర్వహిస్తుంటే ఉద్యమాన్ని అణిచివేయడం కోసం సైనికులు,పోలీసుల చేత రోడ్లపై మెకులు కొట్టించడం దుర్మర్గమన్నారు.కేంద్ర ప్రభుత్వం( Central Govt ) వ్యవసాయ రంగాన్ని దివాలా తీయించే విధంగా వ్యవహరిస్తూ కార్పొరేట్ శక్తుల చేతుల్లో దేశ వ్యవసాయ రంగాన్ని పెట్టాలని చూస్తుందన్నారు.
అంబానీ,ఆదానీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ రైతులను నిర్లక్ష్యం చేస్తున్న మోడీ విధానాలను ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు.ఢిల్లీ రైతాంగ ఉద్యమంలో పాల్గొన్న రైతులపై బనాయించిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, రైతాంగ ఉద్యమం సందర్భంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడం కోసం మోడీ అనుసరిస్తున్న ప్రజా, కార్మిక,రైతాంగ వ్యతిరేక విధానాలపై ఉద్యమాలు నిర్వహించడం కోసం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటాలకు అన్ని వర్గాల ప్రజలు సంఘీభావం తెలపాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు, ప్రజా సంఘాల నాయకులు కొలిశెట్టి యాదగిరిరావు,కోట గోపి,తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దండా వెంకటరెడ్డి, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి గంటా నాగయ్య,ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్, రైతు సంఘం జిల్లా నాయకులు ఖమ్మంపాటి అంతయ్య,బూర వెంకటేశ్వర్లు,ఓడబ్ల్యు జిల్లా కార్యదర్శి జేసోజు మధు, తెలంగాణ రైతు సంఘం నాయకులు కందాల శంకర్ రెడ్డి,జె.
నరసింహారావు వేల్పుల వెంకన్న,చినపంగి నరసయ్య,కొప్పుల రజిత కిరాణా అండ్ ఫ్యాన్సీ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు బొమ్మిడి లక్ష్మీనారాయణ, సిఐటియు జిల్లా అధ్యక్షుడు రాంబాబు, రైతు సంఘం జిల్లా నాయకులు నారాయణ, వీరారెడ్డి,రెగటి లింగయ్య, గాలి కృష్ణ,పి.డి.ఎస్.యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలబోయిన కిరణ్,భరత్ పివైఎల్ నాయకులు దశరథ,రవి,బొల్లి వెంకన్న, నరసింహ,బొడ్డు ముత్తయ్య,ప్రజాసంఘాల నాయకులు చిత్రం భద్రమ్మ,నల్లమేకల అంజయ్య,కోడి ఎల్లయ్య ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు వినోద్,జిల్లా నాయకులు ఉత్తేజ్,సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.