ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం హోరాహోరీగా ఉంది.2024 ఎన్నికలలో( 2024 elections ) ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుంది.టీడీపీ.బీజేపీ… జనసేన మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీకి దిగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఏపీలో ఎన్నికలకు ఇంకా 40 రోజులు మాత్రమే సమయం ఉంది.ఇటువంటి పరిస్థితులలో వాలంటీర్ల విషయంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
విషయంలోకి వెళ్తే వాలంటీర్లను( volunteers ) తక్షణమే ఎన్నికల విధుల నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

ఎన్నికలతో ముడిపడిన ఏ ప్రక్రియలోనూ వాలంటీర్లను పాల్గొనివ్వకూడదని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది.పోలింగ్ ఏజెంట్లుగా కూడా ఉండేందుకు వారు అనర్హులని తెలిపింది.ఎన్నికల విధులకు వాలంటీర్లు దూరంగా ఉండాలని కొన్ని వారాల క్రితం న్యాయస్థానం తీర్పు ఇవ్వడం జరిగింది.
దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం.వాలంటీర్లను ఎన్నికల విధుల నుండి తొలగిస్తూ అన్ని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
గతంలో వాలంటీర్ వ్యవస్థ( Volunteer system ) విషయంలో విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశాయి. పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తన వారాహి యాత్రలో వాలంటీర్ వ్యవస్థను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా పెను దుమారాన్ని రేపాయి.
ఈ క్రమంలో వాలంటీర్లను ఎన్నికలకు పూర్తిగా దూరంగా ఉంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం సంచలనంగా మారింది.







