మామూలుగా అక్కినేని నాగేశ్వరరావు తొలినాళ్లలో కెరియర్ మొత్తం చెన్నైలోనే గడిచింది.ఆయన తన సినిమాలను తెలుగు భాషతో పాటు తమిళంలో కూడా విడుదల చేసేవారు అప్పటి స్టార్ హీరోలంతా తమిళ్, తెలుగు రెండు భాషలలో విడుదల చేసి పాపులారిటీ సంపాదించుకునేవారు.
అయితే కొన్నాళ్ళకి అక్కినేని హైదరాబాద్ కి షిఫ్ట్ అయిపోయారు.చాలామంది ఆ టైంలో ఏమనుకున్నారు అంటే అందరూ టాలీవుడ్ హైదరాబాద్ కి వెళ్ళిపోయింది కాబట్టి అక్కినేని( Akkineni Nageswararao ) కూడా వెళ్లిపోయారు అని అనుకున్నారు.
కానీ అసలు విషయం వేరే ఉంది.ఆయన ఆ చెన్నై వదిలిపెట్టి రావడానికి గల కారణం ఒక హీరో అని చాలా ఆలస్యంగా తెలిసింది.
ఇంతకీ ఆ హీరో ఎవరు? ఎందుకు చెన్నై వదిలిపెట్టి హైదరాబాద్ కి రావాల్సి వచ్చింది అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అక్కినేని నాగేశ్వరరావు తెలుగులో ఒక స్టార్ హీరోగా నెంబర్ వన్ స్థానంలో దూసుకుపోతున్న రోజుల్లో కమల్ హాసన్ ఒకరోజు అక్కినేని గారిని కలిశారట.అప్పటికి కేవలం అక్కినేని తెలుగులోనే సినిమాలు తీస్తున్నారు.ఎన్టీఆర్( NTR ) తో పోటీపడి ఇక్కడ ఒక స్టూడియో కట్టి బాగానే సెటిలైపోయారు.
కానీ ఎందుకో తమిళంలో మాత్రం ఆయన చిత్రాలు ఆగిపోయాయి.ఆ విషయంలో ఒకతూహలంతో కమల్ హాసన్ మీరు ఇంత పెద్ద స్టార్ మీ సినిమాలన్నీ విజయం సాధిస్తున్నాయి.
ఎందుకు మీరు మీ సినిమాలను తమిళంలో కూడా విడుదల చేయడం లేదు అని అడిగారట.అందుకు బదులుగా అక్కడ ఒక తుఫాను వచ్చింది ఆ తుఫాను కారణంగానే నేను హైదరాబాద్( Hyderabad )కి రావాల్సి వచ్చింది అని చెప్పారట.
ఆ తుఫాను మరేంటో కాదు శివాజీ గణేషన్.అప్పుడు ఆయన సినిమాలు బాగా డిమాండ్ లో ఉండడంతో అక్కినేని సినిమాలు వరుసగా పరాజయాలు చవిచూడాల్సి వచ్చింది అంట.దాంతో ఇక తనకు తమిళంలో డిమాండ్ లేదని తెలుసుకొని అక్కినేని కేవలం తెలుగులోనే సినిమాలు తీయాలి అనుకున్నారట.నిజానికి అక్కినేని శివాజీ గణేషన్ ఇద్దరూ కూడా మంచి మిత్రులు.
అరేయ్ ఒరేయ్ అని పిలుచుకునేంత చనువు కూడా వీరి మధ్యలో ఉంది.అయినా కూడా సినిమాల విషయంలో ఎవరికైనా కెరియర్ కాబట్టి ఆయన తన కెరీర్ కాపాడుకోవడానికి చెన్నై నుంచి హైదరాబాద్ కి మకాం మార్చారంట.
ఈ విషయం చాలా ఆలస్యంగా తెలిసింది.