రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట( Yellareddypet ) మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో హౌస్ టాక్స్ ఇంటి పన్నులు 25 లక్షల రూపాయల బకాయిలు ఉన్నాయని వాటిని వసూలు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని, ఇంటి పన్ను కట్టని యజమానులపై అవసరమగు చర్యలు తీసుకొని ఇంటి పన్నులు కట్టే విధంగా సిబ్బంది పూర్తిస్థాయిలో పనిచేయాలని రాజన్న సిరిసిల్ల డిఎల్పిఓ మల్లి ఖార్జున్ అధికారులకు పలు సూచనలు చేశారు.
గ్రామంలో గ్రామ పంచాయతీ సిబ్బంది ఇల్లు ఇల్లు తిరిగి హౌజ్ టాక్స్ ఏలా వసూలు చేస్తున్నారు డీఎల్ పి ఓ మల్లి ఖార్జున్( Mallikarjun ) పరిశీలించారు.
అక్కడ గ్రామ పంచాయతీ కార్యదర్శి దేవరాజు, జూనియర్ అసిస్టెంట్ బాలకృష్ణ, సిబ్బంది రామచంద్రం, తదితరులు ఉన్నారు.







