తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలేలా ఉంది.ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్( MLA Bajireddy Govardhan ) కాంగ్రెస్ పార్టీలోకి చేరతారని ప్రచారం జోరుగా సాగుతోంది.
ఈ క్రమంలో బాజిరెడ్డి గోవర్ధన్ తో కాంగ్రెస్ నేతలు సంప్రదింపులు చేస్తున్నారని సమాచారం.మున్నూరు కాపు సామాజిక వర్గంతో పాటు నిజామాబాద్ జిల్లాలో బలమైన నేతగా ఉండటంతో బాజిరెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి( Congress party ) రావాలని ఆహ్వానిస్తోందని తెలుస్తోంది.
రానున్న లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా బాజిరెడ్డిని బరిలోకి దింపే యోచనలో హస్తం పార్టీ ఉందని సమాచారం.ఈ క్రమంలో బాజిరెడ్డితో కాంగ్రెస్ చర్చలు సఫలం అయితే నిజామాబాద్ ఎంపీగా ఆయన పోటీ చేసే అవకాశం ఉంది.







