యాదాద్రి భువనగిరి జిల్లా: భార్య మృతి తట్టుకోలేక భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే…అడ్డగూడూరుకు చెందిన మనోహర్ గత నెల 17వ తేదీన భూమికను ప్రేమ వివాహం చేసుకున్నాడు.
పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నవ వధువును మనోహర్ పేరెంట్స్ వేధింపులకు గురి చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన భూమిక ఈ నెల 6వ తేదీన ఆత్మహత్యకు యత్నించగా హాస్పిటల్ కు తరలించారు.చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందింది.
భార్య చనిపోయిన సమాచారం తెలుసుకున్న మనోహర్ తీవ్ర ఆవేదన చెందాడు.అతను కూడా ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.
కుటుంబ సభ్యులు అతన్ని తిరుమలగిరి ఆస్పత్రికి తరలించారు.అత్తింటి వేధింపులతోనే భూమిక ఆత్మహత్య చేసుకుందని బంధువులు ఆరోపిస్తున్నారు.







