బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని మేదరమెట్లలో వైసీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘సిద్ధం’ సభ జరుగుతోంది.ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబుతో పోరాటానికి సిద్ధమా అని సీఎం జగన్ ప్రశ్నించారు.చంద్రబాబు తరహాలో తనకు పొలిటికల్ స్టార్లు లేరన్నారు.
అయితే తనకు జనమే స్టార్ క్యాంపెయినర్లని చెప్పారు.నాలుగు రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ రావొచ్చన్న సీఎం జగన్ తనను ఎదుర్కొనేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసికట్టుగా వస్తున్నాయని తెలిపారు.
పొత్తులతో -ఎత్తులతో – జిత్తులతో రాజకీయం చేస్తున్నారని పేర్కొన్నారు.చంద్రబాబు పొత్తుల కోసం పాకులాడుతున్నారన్న సీఎం జగన్ అదే పొత్తుల కోసం చంద్రబాబు మోకరిల్లుతున్నారని విమర్శించారు.