Prabhas : ఓవర్సీస్ మార్కెట్ లో ప్రభాస్ కింగ్ అంటున్న ఫ్యాన్స్.. ఆ రేంజ్ మరే హీరోకు సాధ్యం కాదంటూ?

ప్రభాస్( Prabhas ) పేరు వింటేనే యూత్ కి పూనకాలు వచ్చేస్తున్నాయి.హిట్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా మినిమం టాక్ వస్తే చాలు మొదటి రోజే 100 కోట్ల ఓపెనింగ్ అందుకునే హీరోగా రికార్డు క్రియేట్ చేశాడు ప్రభాస్.

 Prabhas Overseas Market Will Shock You Full Details Inside-TeluguStop.com

బాహుబలి( Baahubali ) చిత్రాలతో వరల్డ్ వైడ్ ఇండియన్ ఉన్నచోట తన మార్కెట్ ని పెంచుకున్నాడు ప్రభాస్.సాలార్ వరల్డ్ వైడ్ గా మంచి రిజల్ట్స్ ని సాధించడంతో ఓవర్సీస్ లో ప్రభాస్ మార్కెట్ ని కలెక్షన్స్ ని రీచ్ అయ్యే హీరోలు దరిదాపుల్లో లేరని చెప్పాలి.

Telugu Bahubali, Bollywood, Prabhas, Prashanth Neel, Rajamouli, Salaar-Movie

నిజానికి ఓవర్సీస్ అంటే చాలామంది యూఎస్ బాక్స్ ఆఫీస్ మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు.అయితే ఇండియా సినిమాకి యుఎస్ తో పాటు యూకే,ఆస్ట్రేలియా, అరబిక్ మిడిల్ ఈస్ట్ దేశాలలో కూడా మంచి ఆదరణ లభిస్తూ ఉంటుంది.బాహుబలి తో తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తం చేసిన తరువాత విదేశీయులు సౌత్ సినిమాలని చూడటానికి ఇష్టపడుతున్నారు.ఓవర్సీస్ మార్కెట్లో తమిళ్, మలయాళీ, హిందీ సినిమాలకి మంచి డిమాండ్ ఉంది.

Telugu Bahubali, Bollywood, Prabhas, Prashanth Neel, Rajamouli, Salaar-Movie

తెలుగు సినిమాలకి వచ్చేసరికి ప్రభాస్ మాత్రమే ఓవర్సీస్ లో మంచి కలెక్షన్స్ రాబడుతున్నాడు.ఇండియాలో భారీ బడ్జెట్ సినిమాలు ఎక్కువగా టాలీవుడ్ లోనే నిర్మాణం అవుతున్నాయి.కానీ వరల్డ్ వైడ్ గా మార్కెట్ పై ఇంపాక్ట్ క్రియేట్ చేయడంలో మాత్రం మన హీరోలు వెనుకబడి ఉన్నారు.ఒక ప్రభాస్ మాత్రమే తన మార్కెట్ రేంజ్ ని పెంచుకుంటూ పోతున్నాడు.

ప్రభాస్ ఓవర్సీస్ మార్కెట్లో నాలుగు మిలియన్ డాలర్స్ కి పైగా కలెక్ట్ చేసిన తెలుగు స్టార్స్ హీరోలలో ప్రభాస్ మాత్రమే ఎక్కువసార్లు కనిపిస్తున్నాడు.తమిళంలో మాత్రం విజయ్, రజినీకాంత్, అజిత్, కమల్ హాసన్ వంటి స్టార్స్ కి ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ఉంది.

ఇక బాలీవుడ్( Bollywood) సినిమాలు కి అయితే చాలా ఈజీగా నాలుగు మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ వచ్చేస్తూ ఉంటాయి.ఏదైనా ఈ విషయంపై టాలీవుడ్ లో మిగిలిన హీరోలు దృష్టిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube