పంజాబ్ ( Punjab )లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.తమ డిమాండ్ల సాధనే లక్ష్యంగా రైతు సంఘాలు రైల్ రోకో నిర్వహించారు.
రైలు పట్టాలపై కూర్చుని నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు సాయంత్రం 4 గంటల వరకు రైల్ రోకో కార్యక్రమం( Rail Roko programme ) చేపడతామని చెబుతున్నారు.ఈ క్రమంలోనే కనీస మద్ధతు ధర సహా ఇతర సమస్యలను కూడా పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
కాగా రైల్వే ట్రాక్ లపై రైతులు నిరసన వ్యక్తం చేస్తుండటంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.







