Viral : వైరల్: అంబరాన్ని అంటిన ఆవు దూడ పుట్టినరోజు వేడుకలు..!

ఎక్కడైనా మనం మన బంధువులు కానీ స్నేహితుల కానీ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం మనం అందులో పాల్గొనడం జీవితంలో సర్వసాధారణ విషయం.ఎప్పుడు మనుషులు పుట్టినరోజు వేడుకలు జరిపడమే కాదు.

 Birthday Celebrations Of The Viral Amber Cow Calf-TeluguStop.com

కొందరు వారు ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న జంతువులకు సైతం జన్మదిన వేడుకలు ( Birthday celebrations )జరుగుతుండడం మనం సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు చూసే ఉంటాము.తాజాగా ఇలాంటి సంఘటనకు సంబంధించిన విషయం వైరల్ గా మారింది.

స్థానికంగా స్వామి వివేకానంద అనే స్వచ్ఛంద సంస్థలో( Swami Vivekananda ) నిర్వహిస్తున్న గోశాలలో ఉన్న కళా గోమాతకి సంవత్సరం క్రితం దూడ పుట్టింది.ఆ దూడకి సురభి( Surabhi ) అని స్వచ్చంద సంస్థ సభ్యులు నామకరణం చేశారు.ఆవు దూడ పుట్టి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా సురభి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.మొదటి సంవత్సరం వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు.

మొదటగా తల్లి గోమాతకు, సురభికి సాంప్రదాయపదంగా పూజలు నిర్వహించారు.ఇందులో భాగంగా అందరికీ తాంబూలాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏకంగా 500 పైగా మహిళలు పాల్గొన్నారు.

500 మహిళలు ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఆవుకు పుట్టినరోజు వేడుకలను జరిపించారంటే కార్యక్రమం ఏ రేంజ్ లో జరిగింది ఇట్టే అర్థం చేసుకోవచ్చు.ఈ సందర్భంగా వివేకానంద స్వచ్చంద సంస్థ అధ్యక్షుడిగా ఉన్న అప్పారావు మాట్లాడుతూ మనం హిందూ ధర్మం ప్రకారం గోమాత అంటే లక్ష్మీదేవిని పూజిస్తామని., అలాగే సురభి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున పుట్టడంతో అది మరింత అదృష్టంగా భావించి ఇలాంటి కార్యక్రమం నిర్వహించామని తెలుపుతూ సురభి పుట్టినరోజు సందర్భంగా విచ్చేసిన మహిళలందరికీ పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube