ప్రస్తుతం భారత దేశం( India )లో వేసవికాలం నడుస్తోంది.ఈ సమయంలో వీధి కుక్కలు( Stray dogs ) డీహైడ్రేషన్‌కి గురవుతాయి.
దానివల్ల అవి పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ మనుషుల మీద దాడులు చేస్తుంటాయి.మామూలు కాలాల్లో కూడా కొన్ని ఇవి అనవసరంగానే ఎటాక్ చేస్తాయి.
ముఖ్యంగా చిన్నపిల్లలను టార్గెట్ గా చూస్తాయి.అందుకే వారిని ఎప్పుడూ ఒంటరిగా వదిలి పెట్టకూడదు.
కానీ ఇటీవల ఉత్తరప్రదేశ్( Uttar Pradesh )లోని అమ్రోహా జిల్లాలో ఒక బాలిక ఒంటరిగా బయటకు వచ్చింది.నిజానికి ఆమె వేరే ప్రాంతానికి ఏం వెళ్లలేదు.
తన ఇంటి బయటే భయానక దాడిని ఎదుర్కొంది.

మొత్తం 5 వీధి కుక్కల గుంపు ఆమెపై దాడి చేసింది.ఈ భయానక దృశ్యాలు సమీపంలో ఇన్‌స్టాల్ చేసిన సెక్యూరిటీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి, కుక్కలు అమ్మాయి వద్దకు వెళ్లి కరవడం ఇందులో కనిపించింది.తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ, ఆ అమ్మాయి వీధికి అవతలి వైపుకు పరిగెత్తింది.
దురదృష్టవశాత్తు, ఆమె కాలు జారిపడి కింద పడిపోయింది.అప్పుడు కుక్కలు ఆమెను నేల మీద డ్రాగ్ చేస్తూ మరింత గాయపరిచాయి.
అదృష్టవశాత్తూ, సమీపంలో నివసిస్తున్న ప్రజలు ఈ కుక్కతో ఆడి గురించి తెలుసుకున్నారు.ఒక వ్యక్తి బిగ్గరగా అరుస్తూ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు అతడిని చూసి కుక్కలు పారిపోయాయి.
అనంతరం అడవి లేని స్థితిలో ఉన్న ఆ చిన్నారిని తన చేతిలోకి తీసుకొని అతడు తీసుకెళ్లాడు.దాంతో ఈ దాడి నుంచి బాలిక బయటపడ గలిగింది.

ఇది ఒక్కసారి జరిగిన విషయం కాదు, ఈ వీధి కుక్కలు ఇంతకు ముందు కూడా ఇతరులపై దాడి చేశాయని ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు చెబుతున్నారు.ఇప్పుడు, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ కుక్కల వల్ల కలిగే ప్రమాదం గురించి ఆందోళన పెరుగుతోంది.ఇంత దూకుడుగా ఉన్న కుక్కలను జనాలు లేని వేరే ప్రాంతాల్లో విడిచి పెడితే మంచిదని చాలామంది కోరుకుంటున్నారు.అవి ఏంటి గుంపుగా ఉండకుండా ఉండాలంటే ఆ గుంపును విడదీయాలని మరికొందరు పేర్కొన్నారు.
ఏది ఏమైనా ఈ కుక్కలు ప్రజలపై దాడులు చేస్తూ చివరికి వాటి ప్రాణాల మీదకే తెచ్చుకుంటున్నాయి.







