మాజీ ఎంపీ సీతారాం నాయక్( Former MP Seetharam Naik ) కీలక వ్యాఖ్యలు చేశారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో( Kishan Reddy ) సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో తాను ఎంత చేసినా సరైన గుర్తింపు దక్కలేదన్నారు.
అయితే ఇవాళ తనకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ద్వారా గుర్తింపు లభించిందని పేర్కొన్నారు.బీజేపీలోకి రావాలని కిషన్ రెడ్డి ఆహ్వానించారని చెప్పారు.
అయితే ఇది తాను ఒక్కడే తీసుకున్న నిర్ణయం కాదన్నారు.తనను నమ్మిన ఏడు నియోజకవర్గాలు ఉన్నాయన్న సీతారాం నాయక్ అనుచరులు, అభిమానులతో చర్చించిన అనంతరం రాజకీయ భవిష్యత్ వెల్లడిస్తానని తెలిపారు.







