ఏపీలో గతంలోని టీడీపీ ప్రభుత్వంపై తెలంగాణ హైకోర్టు( Telangana High Court ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.ఐఎంజీ భారత్ కు( IMG Bharat ) చంద్రబాబు భూ కేటాయింపులు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది.2003 లో ఐఎంజీ భారత్ కు ఎకరం రూ.50 వేల చొప్పున ఎనిమిది వందల ఎకరాల భూమిని చంద్రబాబు కేటాయించారు.సుమారు రూ.50 వేల కోట్ల విలువైన 800 ఎకరాల భూములను ఫేక్ కంపెనీకి చంద్రబాబు( Chandrababu Naidu ) ధారాదత్తం చేశారు.అయితే ఈ వ్యవహారంపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు ఆ 800 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని కీలక తీర్పును వెలువరించింది.అప్పటి టీడీపీ హాయాంలో చంద్రబాబు చేసిన భూముల కేటాయింపులను రద్దు చేస్తూ వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను న్యాయస్థానం సమర్థించింది.

2003 ఆగస్టు 5న ఐఎంజీ భారత్ అనే కంపెనీని రిజిస్టర్ చేయగా.ఆ సంస్థ అధినేతగా అహోబలరావు అలియాస్ బిల్లీరావు ఉన్నారు.క్రీడా మైదానాలు కట్టి, 2020 ఒలింపిక్స్ కోసం క్రీడాకారులను సిద్ధం చేస్తామంటూ ప్రచారం చేసిన కంపెనీ.నాలుగు రోజులకే ఉమ్మడి ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలిలో సెంట్రల్ యూనివర్సిటీకి( Central University ) చెందిన 400 ఎకరాలు, సరూర్ నగర్ మండలం మామిడిపల్లిలో విమానాశ్రయానికి అత్యంత చేరువలో 450 ఎకరాలను కంపెనీకి కేటాయించింది.అంతేకాకుండా ఆ సమయంలో సదరు భూమి సుమారు ఎకరం రూ.10 కోట్లు ధర పలుకుతుండగా.ఎకరం రూ.50 వేల చొప్పున కేటాయిస్తూ 2003 ఆగస్టు 9న చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం( TDP Govt ) కూలిపోయిన తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం విస్తృత ప్రజా ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని సదరు భూమిని వెనక్కు తీసుకుంటూ చట్టం చేసింది.ఐఏంజీకి చంద్రబాబు అపద్ధర్మ ప్రభుత్వం కేటాయించిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంది.ఈ నేపథ్యంలోనే ఎలాంటి అనుభవం లేని సంస్థకు ఎలా అప్పగిస్తారంటూ చంద్రబాబు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది.
ఎటువంటి విచారణ లేకుండా, అత్యంత ఖరీదైన ప్రాంతంలో వేల కోట్ల విలువైన భూముులను కారు చౌకగా ధారదత్తం చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోవడంపై తీవ్రంగా మండిపడింది.

అయితే కంపెనీకి భూ కేటాయింపు రద్దును సవాల్ చేస్తూ సదరు ఐఎంజీ భారత్ హైకోర్టును ఆశ్రయించింది.అప్పటి నుంచి స్టేటస్ కో లో ఉండిపోయింది.సుదీర్ఘ వాదోపవాదనలు కొనసాగిన తరువాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ విచారణ తరువాత హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది.దీంతో రూ.వేల కోట్ల భూమి ప్రభుత్వ ఖాతాలో పడింది.ఈ క్రమంలోనే జస్టిస్ అనిల్ కుమార్, జస్టిస్ అలోక్ ఆరాధే ధర్మాసనం ఈ వ్యవహారంపై మీరు సీబీఐ విచారణ( CBI Enquirty ) జరిపిస్తారా? లేక మమ్మల్నే ఆదేశించమంటారా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.అదేవిధంగా దీనిపై వారం రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని తెలిపింది.అనంతరం విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.







