ఎంజాయ్ ఎంజామి.ఈ ఆల్బమ్ ఎంతటి సెన్సేషన్ను క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే.
దాదాపు మూడేళ్ల క్రితం వచ్చిన ఈ ఆల్బమ్ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.గాయని ఢీ, తమిళ రాపర్ అరివు తారాగణంగా సంతోష్ నారాయణన్ ( Santosh Narayanan )నిర్మించారు.
యూట్యూబ్‌లో సరికొత్త రికార్డులు సృష్టించింది.ఇది విడుదలై మూడేళ్లు అయిన సందర్భంగా సంతోష్ తాజాగా స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు.
కోట్లలో వ్యూస్ దక్కించుకున్న ఈ పాట వల్ల తాము ఏ మాత్రం ప్రయోజనం పొందలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.ఎంజాయ్ ఎంజామిని ఆదరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.దీనికి ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ లభించింది.
బిలియన్లలో స్ట్రీమింగ్స్ అందుకుంది.అయితే, దీనివల్ల మేము ఎంత డబ్బు సంపాదించామో చెప్పాలనుకుంటున్నాను.
మేము సంపాదించింది సున్నా.నిజం, మాకు ఒక్క రూపాయి కూడా రాలేదు.
ఈ విషయంపై పాటను విడుదల చేసిన మజ్జా లేబుల్‌ను( Label Mazza ) సంప్రదించాలని ఎన్నోసార్లు ప్రయత్నించాము.

కానీ దురదృష్టవశాత్తు ప్రయోజనం లేకుండా పోయింది.ఆ లేబుల్ మాత్రం భారీ మొత్తంలో రెవెన్యూ అందుకుంది అని ఆయన ఆరోపణలు చేశారు.ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.
యూట్యూబ్ లో అంతటి సెన్సేషన్ను క్రియేట్ చేసిన ఈ సాంగ్ వల్ల వారికి ఒక్క రూపాయి కూడా రాలేదు అన్నది నిజంగా ఆశ్చర్య పోవాల్సిన విషయం అని చెప్పవచ్చు.







