త్వరలో లోక్ సభ ఎన్నికలు( Lok Sabha Elections ) రానున్న నేపథ్యంలో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితా( Congress Party Candidates First List )ను విడుదల చేసింది.ఈ మేరకు రాష్ట్రంలో నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ ప్రకటించింది.
జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సురేశ్ షెట్కార్, చేవెళ్ల నియోజకవర్గానికి సునీతా మహేందర్ రెడ్డి, నల్గొండ నియోజకవర్గానికి కుందూరు రఘువీర్ మరియు మహబూబాబాద్ నియోజకవర్గానికి అభ్యర్థిగా బలరాం నాయక్ లను పార్టీ అధిష్టానం ఖరారు చేసింది.







