Viral Video: వైరల్ వీడియో: మెట్రోలో సీట్ దొరకలేదని అతడు ఏకంగా..?!

సిటీలలో మెట్రో ప్రయాణం చాలామందికి అవసరం.సిటీలోని సుదూర ప్రాంతాలకు అతి తక్కువ సమయంలో ప్రయాణించడానికి మెట్రోను చాలామంది ఉపయోగిస్తుంటారు.

 In The Viral Video He Said That He Could Not Find A Seat In The Metro-TeluguStop.com

అయితే ఇలా మెట్రోలలో ప్రయాణిస్తున్న సమయంలో చాలాసార్లు సీటు దొరకడం కష్టమవుతుంది.ముఖ్యంగా ఆఫీస్ కి వెళ్లే సమయంలో వచ్చే సమయంలో ఇలాంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉంటాం.

ఎవరైనా లేచి వెళ్లేంతవరకు మనం నిలబడి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది.తాజాగా ఇలాగే ఓ ప్రయాణికుడు రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో తనకి సీట్ లేకుండా పోయింది.

తన చుట్టూ అందరూ కూర్చొని ప్రయాణం చేస్తుండగా.అతను మాత్రం నిలబడి ప్రయాణం చేస్తున్నాడు.

అయితే తాను కూర్చుని ప్రయాణం చేయాలనుకున్నాడో ఏమో తెలియదు కానీ., అతడు చేసిన పనికి ఆకస్మాత్తుగా ఆ మెట్రో కోచ్ మొత్తం ఖాళీ అయిపోయింది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

Telugu Find Seat Metro, Metro Train, Train Seat-Latest News - Telugu

ఓ వ్యక్తి మెట్రోలో ప్రయాణం చేస్తున్న సమయంలో అతనికి సీటు లేకపోవడంతో సీటు కోసం అతను ఓ చీప్ ట్రిక్ ప్లే చేశాడు.అందులో భాగంగానే అతడు తనకు హెల్త్ బాగోలేనట్టుగా నటిస్తూనే.అతనికి వాంతికి ( vomting ) వచ్చేలా డ్రామా మొదలుపెట్టాడు.

దాంతో అక్కడివారు తమపై ఎక్కడ వామిటింగ్ పడుతుందో అని భావించి వెంటనే ఆ కోచ్ లో ఉన్న అందరూ అక్కడి నుంచి లేచి వెళ్లిపోయారు.దీంతో ఆ కోచ్ లో ఉన్న సీట్లన్నీ క్షణకాలంలో ఖాళీ అయిపోయాయి.

ఇంకేముంది సదరు వ్యక్తి దర్జాగా ఆ సీట్లో వెళ్లి ప్రశాంతంగా కూర్చున్నాడు.ఇందుకు సంబంధించిన ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

Telugu Find Seat Metro, Metro Train, Train Seat-Latest News - Telugu

ఈ వీడియో చూసిన నెటిజెన్స్ వారి స్టైల్ లో స్పందిస్తున్నారు.తమకు ఇలాంటి ఆలోచన ఇంతవరకు రాలేదని.ఇకపై తాము మెట్రోలో( metro ) ప్రయాణిస్తున్నప్పుడు ఒక్కసారైనా ప్రయత్నిస్తామని కొందరు తెలుపుతున్నారు.మరికొందరైతే మెట్రో సీట్ కోసం ఇంత దారుణంగా ప్రవర్తించాలా అంటూ అతడిపై కోపం వ్యక్తం చేస్తున్నారు.

మరికొందరైతే ఇన్ని రోజుల నుంచి తాము మెట్రోలో ప్రయాణిస్తున్న కానీ ఇలాంటి ఆలోచన తమకు రాకపోవడం నిజంగా బాధాకరమంటూ వారి ఫీలింగ్స్ ను సరదాగా తెలుపుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube