కాపు సంక్షేమ సేన నాయకుడు హరి రామ జోగయ్య( Harirama Jogaiah ) జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి వరుసపెట్టి లేఖలు రాస్తున్నారు.గతంలో తెలుగుదేశంతో పొత్తు విషయంలో పలు సూచనలు చేస్తూ లెటర్లు రాయడం జరిగింది.
సీట్ల విషయంలో ఇంకా అనేక విషయాలు గురించి సూచనలు చేశారు.కాగా లేటెస్ట్ గా రెండో జాబితా అదేవిధంగా బీసీ డిక్లరేషన్ మాదిరిగా కాపు డిక్లరేషన్( Kapu Declaration ) ప్రకటించాలని డిమాండ్ చేశారు.
రెండో జాబితాలో బలిజ సామాజిక వర్గానికి( Balija ) సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.రాయలసీమలో 20 లక్షల మంది వరకు బలిజ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారని గుర్తు చేశారు.
ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ కూడా రాజకీయంగా రాయలసీమ( Rayalaseema )లో బలిజలకు ప్రాధాన్యత ఇవ్వలేదని.ఈ లోటును జనసేన టీడీపీ( Janasena TDP ) తీరుస్తుందని ఆశిస్తున్నట్లు స్పష్టం చేశారు.ఆల్రెడీ జనసేన టీడీపీ తొలి జాబితా విడుదల చేయడం జరిగింది.రెండో జాబితా విడుదల విషయంలో ఇటీవల పవన్ మరియు చంద్రబాబు భేటీ కూడా అయ్యారు.ఈ క్రమంలో హరి రామ జోగయ్య లేఖ రాయడం ఏపీ రాజకీయాల్లో( AP Politics ) సంచలనంగా మారింది.ఏపీలో మరో 40 రోజులలో ఎన్నికలు రాబోతున్నాయి.
ఈ క్రమంలో తొలి జాబితా విషయంలో భారీ ఎత్తున తెలుగుదేశం మరీ జనసేన పార్టీలలో అధినాయకులపై అసంతృప్తి జ్వాలలు వ్యక్తం అయ్యాయి.దీంతో రెండో జాబితా విషయంలో చంద్రబాబు పవన్( Chandrababu Pawan ) చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.