తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy )చేసిన వంద రోజుల పాలనలో ఏముందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు( Harish Rao ) ప్రశ్నించారు.కాషాయ పేపర్ పై ప్రధాని మోదీకి( Prime Minister Modi ) లవ్ లెటర్ రాశారని ఎద్దేవా చేశారు, ప్రజలనే కాదు కాంగ్రెస్ పార్టీని సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని ఆరోపించారు.
మోదీ మళ్లీ ప్రధాని కావాలని సీఎం కోరినట్లుందని పేర్కొన్నారు.ప్రధాని ఆశీర్వాదం ఉండాలని రేవంత్ రెడ్డి అడగడం, దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాదని రేవంత్ రెడ్డి తేల్చారని విమర్శించారు.
రాహుల్ గాంధీ ప్రధాని కాలేరని రేవంత్ రెడ్డికి కూడా తెలిసిపోయిందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.







