తెలంగాణ( Telangana )లోని రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సేవలు ఇవాళ్టి నుంచి అందుబాటులోకి రానున్నాయి.ఈ మేరకు రైతునేస్తం పేరుతో వీడియో కాన్ఫరెన్స్ సేవలను కాంగ్రెస్ ప్రభుత్వం అందించనుంది.
సెక్రటేరియట్ నుంచి ఈ సేవలను సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ), మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రారంభించనున్నారు.కాగా రాష్ట్ర వ్యాప్తంగా 2,601 రైతువేదికలు ఉండగా రియల్ టైమ్ సొల్యూషన్ త్రూ డిజిటల్ ప్లాట్ ఫామ్ అనే ప్రాజెక్టు కింద మొదటి విడతలో 110 కేంద్రాల్లో ఈ వ్యవస్థను సర్కార్ అందుబాటులోకి తీసుకువచ్చింది.

వచ్చే ఉగాది నాటికి మిగిలిన రైతువేదికలను అనుసంధానం చేయనుంది.వ్యవసాయ రంగంలో విస్తరణ కార్యకలాపాలు బలోపేతం చేయాలనే లక్ష్యంతో రైతులకు సాంకేతిక పరిజ్ఞానంపై సమగ్ర అవగాహన కల్పించనుంది.ఇందులో భాగంగా ప్రతి మంగళవారం, శుక్రవారం నేరుగా ఆన్ లైన్ శిక్షణలు ఇవ్వనున్నారు.దాంతో పాటుగా రైతుభరోసా భాగంగా 2024 ఖరీఫ్ సీజన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టబోతుందని తెలుస్తోంది.







