టీడీపీ అధినేత చంద్రబాబు పై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఎస్సీ, బీసీ డిక్లరేషన్ల పేరుతో చంద్రబాబు( Chandrababu ) మాయమాటలు చెబుతున్నారని మండిపడ్డారు.
కొత్తగా వచ్చిన పార్టీ తరహాలో హామీలు ఇస్తున్నారని పేర్కొన్నారు.
సీఎం జగన్( CM YS Jagan ) చేసినవన్నీ తానే చేసినట్లు చంద్రబాబు చెప్పుకుంటున్నారని విమర్శించారు.ప్రజలకు సంబంధం లేని విషయాలను మాట్లాడటమే కాకుండా సీఎం జగన్ పై వ్యక్తిగత దూషణకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.రాజకీయ నేతగా ఉన్న చంద్రబాబు గతంలో ఏం చేశాడు.? అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పాలని సూచించారు.