Pushpa 2 : పుష్ప 2 లో గెస్ట్ అప్పిరియన్స్ ఇవ్వనున్న స్టార్ హీరో…

అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా సుకుమార్( Sukumar ) దర్శకత్వంలో వచ్చిన ఆర్య సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది.ఇక వీళ్లిద్దరూ అప్పటినుంచి ఇండస్ట్రీలో స్టార్లుగా కొనసాగుతున్నారు.

 Star Hero To Give Guest Appearance In Pushpa 2-TeluguStop.com

ఇక మొత్తానికైతే వీళ్ళ కాంబినేషన్ లో ఆర్య 2 సినిమా కూడా వచ్చింది.అయితే ఆ సినిమా ప్రేక్షకులను అలరించలేదు.

దాంతో ఇప్పుడు పుష్ప సినిమాతో మరోసారి వాళ్ళిద్దరూ కలిసి పాన్ ఇండియా రేంజ్ లో భారీ సక్సెస్ ని అందుకున్నారు.

 Star Hero To Give Guest Appearance In Pushpa 2-Pushpa 2 : పుష్ప 2 ల-TeluguStop.com

అయితే ఇప్పుడు పుష్ప 2( Pushpa 2 ) సినిమాతో మరొకసారి వాళ్ల సత్తా ఏంటో చూపించాలని చూస్తున్నారు.ఇక ఇదిలా ఉంటే పుష్ప సినిమా మీద ఇప్పటికే అంచనాలు తార స్థాయిలో పెరిగిపోతున్నాయి.ఇక బాలీవుడ్ లో అయితే ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమా కోసం వాళ్లు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం తమిళ్ ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరో అయిన సూర్య ( Surya )కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్టుగా తెలుస్తుంది.

అది కూడా విక్రమ్ సినిమాలో రోలెక్స్ లాంటి పాత్ర ను చేసి సూర్య ఎలాగైతే మెప్పించాడో, అలాగే ఈ సినిమాలో కూడా గెస్ట్ పాత్రలో కనిపించి ఈ సినిమాకి హైప్ తెప్పించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.అయితే ఈ న్యూస్ ని సినిమా యూనిట్ అత్యంత రహస్యంగా ఉంచాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఈ న్యూస్ సోషల్ మీడియాలో లీక్ అయింది.ఇక దానివల్ల చేసేదేం లేక సినిమా యూనిట్ కూడా మరికొద్ది రోజుల్లో దీన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయాలని చూస్తున్నాట్టుగా తెలుస్తుంది.ఇక ఇదే కనక నిజమైతే ఈ సినిమా మీద సగటు ప్రేక్షకుడు పెట్టుకున్న అంచనాలు భారీ రేంజ్ లో పెరిగిపోతాయని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube