పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ముస్తాబాద్ జడ్పీటీసీ గుండం నర్సయ్య అన్నారు ముస్తాబాద్ మండల కేంద్రం లో గృహజ్యోతి పథకాన్ని( Gruha Jyothi ) సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి,విద్యుత్ ఏ డి,కాంగ్రెస్ మండల అధ్యక్షుడు యెల్ల బాల్ రెడ్డి.కాంగ్రెస్ శ్రేణుల తో కలిసి మంగళవారం వారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ బీద బడుగు బలహీన ప్రజలకు మేలు చేకూర్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు చేపట్టిందని తెలిపారు.వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
అనంతరం సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 1,70,000 విద్యుత్ కనెక్షన్ ఉన్నాయని దీనిలో 80 వేల వరకు 200 యూనిట్ల వరకు ఉచిత పథకానికి అర్హులుగా తేలారని తెలిపారు .
ముస్తాబాద్‌లో 1100 సర్వీస్ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని కొందరికి వారు దరఖాస్తులు చేసిన తప్పిదం వల్ల పథకానికి అనర్హులుగా అయ్యారని తెలిపారు సరి చేసుకొనివారు ఎప్పుడైనా సరే గృహ జ్యోతి పథకానికి స్థానిక సెస్ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించినట్టయితే వాటిని సరి చేస్తామన్నారు.ఎవరు ఎలాంటి అపోహ చెందవద్దని అర్హులైన వారందరికీ ఉచిత గృహ జ్యోతి వర్తిస్తుందని తెలిపారు.ఫిబ్రవరిలో 200 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగించిన వారికి ఈ మార్చిలో జీరో బిల్లు వస్తుందన్నారు.
అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు యెల్ల బాల్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామిలో భాగంగా మాట తప్పకుండా మడమ తిప్పకుండా జీరో బిల్ 200 యూనిట్ల వరకు పథకాన్ని హమాలు చేసింది అన్నారు గతం లో కాంగ్రెస్ పార్టీ అధికారం లో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్( Free electricity ) అమలు చేసారని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాగానే నాలుగో హామీ అయిన గృహజ్యోతి పథకంలో గృహ అవసరాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందింస్తుంది అన్నారు.పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది అన్నారు.
గత ప్రభుత్వాలు విద్యుత్ బిల్లులు ప్రజల పై భారాన్ని మోపి నడ్డివిరిచాయి అన్నారు.కానీ కాంగ్రెస్ అధికారంలో వచ్చిన 90 రోజుల్లో ఉచిత విద్యుత్ పథకం అమలు చేయడం హర్షణీయ ము అన్నారు.
సొంతింటి నిర్మాణానికి 5లక్షలు.ఈ నెల 11 నుంచి ఇందిరమ్మ ఇండ్ల పథకం ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Chief Minister Revanth Reddy ) ప్రారంభిస్తున్నారని తెలిపారు నిరుపేదలకు అండగా ఉండాలని సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు శివకేశవ ఆలయ కమిటీ చైర్మన్ ఎల్సాని దేవయ్య ఉచిడి బాల్ రెడ్డి సెస్ ఏడి మహేందర్, లైన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సెస్ ఏ ఈ విష్ణు తేజ తదితరులు పాల్గొన్నారు.