తమిళ్ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్( Rajinikanth ) లాంటి స్టార్ హీరో మరొకరు లేరు అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఈయన నటించిన అన్ని సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో తనకి ఒక సపరేట్ హీరోగా కూడా గుర్తింపు వచ్చేలా చేశాయి.
ఇక ఇలాంటి క్రమంలో కేఎస్ రవికుమార్ డైరెక్షన్ లో రజనీకాంత్ నటించిన ‘నరసింహ ‘ సినిమా( Narasimha Movie ) సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా రజనీకాంత్ రేంజ్ హిట్ ఎలా ఉంటుందో తమిళ ఇండస్ట్రీకి చూపించింది.
ఇక ఈ సినిమా తెలుగులో కూడా డబ్ అయి ఇక్కడ కూడా సూపర్ సక్సెస్ సాధించింది.అయితే ఈ సినిమాలో రజనీకాంత్ తో పాటు నీలాంబరి క్యారెక్టర్ పోషించిన రమ్యకృష్ణ( Ramyakrishna ) పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుంది.అయితే ఆ సినిమాని ఇప్పుడు రీమేక్ చేస్తే ఏ హీరో చేస్తే బాగుంటుంది.
అలాగే రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి క్యారెక్టర్ ని ఏ హీరోయిన్ అయితే సక్సెస్ ఫుల్ గా డెలివరీ చేయగలుగుతుంది అనే ప్రశ్నలు సోషల్ మీడియా వేదికగా చాలామంది అభిమానులు వేస్తున్నారు.
ఇక అందులో చాలామంది రకరకాల సమాధానాలను కూడా తెలియజేస్తున్నారు.ఇక మొత్తానికైతే నరసింహ సినిమాలో రజినీకాంత్ పాత్ర ప్రభాస్( Prabhas ) చేస్తే బాగుంటుంది.అలాగే రమ్యకృష్ణ పాత్రని వరలక్ష్మి శరత్ కుమార్( Varalaxmi Sarath Kumar ) అయితే బాగా డెలివరీ చేయగలరని చాలామంది సోషల్ మీడియా వేదికగా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…ప్రస్తుతం ఉన్న లేడీ ఆర్టిస్టులలో వరలక్ష్మి శరత్ కుమార్ అయితేనే అలాంటి అగ్రెసివ్ క్యారెక్టర్ల ను చాలా బాగా చేయగలరని మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…ఇక మొత్తానికైతే వరలక్ష్మి శరత్ కుమార్ కి తెలుగు, తమిళం లో మంచి గిరాకీ పెరిగిందనే చెప్పాలి…
.