Vivo V30 Pro : వివో వి30 ప్రో స్మార్ట్ ఫోన్ లాంఛ్.. ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే..!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో నుంచి అదిరిపోయే ఫీచర్లతో మరో కొత్త స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లో విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది.వివో కంపెనీ నుంచి వివో v30, వివో వి30 ప్రో స్మార్ట్ ఫోన్లు మార్చి 7న భారత మార్కెట్లో లాంచ్ అవ్వనున్నాయి.

 Vivo V30 Pro Smart Phone Launch Specifications And Price Details-TeluguStop.com

ఈ కొత్త స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషను వివరాలు ఏమిటో చూద్దాం.

ఆన్ లైన్ లో లీక్ అయిన వివరాల ప్రకారం వివో వి30( Vivo V30 ) స్మార్ట్ ఫోన్ 6.78 అంగుళాల కర్వడ్ 1.5k అమోల్డ్ డిస్ ప్లే తో వస్తోంది.120Hz రిఫ్రెష్ రేట్,300Hz టచ్ శాంప్లింగ్ రేట్,2800 నిట్స్ బ్రైట్ నెస్ తో వస్తోంది.ప్రో వెర్షన్ మీడియా టెక్ డైమెన్సిటీ 8200 SoC ని ఎంచుకుంటుంది.

స్టోరేజ్ విషయానికి వస్తే వివో వి30 వేరియంట్ 12GB వరకు LPDDR 4X RAM, 512GB వరకు UFS 2.2స్టోరేజ్ ను అందిస్తుంది.వివో వి30 ప్రో( Vivo V30 Pro ) వేరియంట్ 12GB LPDDR 5X RAM, 512GB UFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది.ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 OS పై పనిచేస్తుంది.5000 mAh బ్యాటరీ సామర్థ్యం తో 80w ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.

కెమెరా విషయానికి వస్తే.ios సపోర్టుతో 50ఎంపీ ప్రైమరీ కెమెరా తో ఉంటుంది.అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ తో( Ultra Wide Angle Lens ) మరో 50ఎంపీ సెన్సార్ తో ఉంటుంది.ప్రో వేరియంట్ ఫోన్ కు అయితే వెనుక వైపు కెమెరా సెటప్ కు 50ఎంపీ పోర్ర్టేయిట్ లెన్స్ తో ఉంటుంది.ఈ ఫోన్ ను మొత్తం గా చూస్తే సెల్ఫీ ప్రియులకు పండుగే.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ ధర అనేది కంపెనీ ఇంకా వెల్లడించలేదు.మార్చి ఏడవ తేదీ విడుదల సమయంలో ధర వివరాలు కంపెనీ వెల్లడించనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube