Ahmadabad : వైరల్: రోడ్డుపై వాహనాలు తిరుగుతుండగానే ఏర్పడ్డ అతిపెద్ద బిలం.. చివరికి..?!

ఎప్పటిలాగానే వాహనాలు రోడ్డుపై వెళ్తున్నాయి.అయితే ఇంతలోనే ఉన్నట్లుండి నడి రోడ్డు మధ్యలో రోడ్డు కుప్పకూలిపోయింది.

 The Biggest Crater Formed While The Vehicles Were Moving On The Viral Road Fina-TeluguStop.com

సంఘటన ఉత్తరప్రదేశ్( Uttar Pradesh ) రాష్ట్రంలోని లక్నోలో( Lucknow ) చోటు చేసుకుంది.ఉన్నట్లుండి రోడ్డు మధ్యలో ఓ భారీ బిలం ఏర్పడింది.

అంతేకాదు ఆ రోడ్డుపై కొద్ది దూరం వరకు పగుళ్లు కూడా ఏర్పడ్డాయి.ఆ బిలం ఏకంగా 30 అడుగుల వెడల్పు, 20 అడుగుల లోతుగా ఏర్పడింది.

అయితే ఈ సంఘటన జరిగిన సమయంలో ఓ కారు మాత్రమే సంఘటనకు గురైందని చెప్పవచ్చు.కారు ముందు భాగం రోడ్డుపై ఆగి ఉండగా.వెనకల భాగం మాత్రం బిలంలోకి పడిపోయాయి.ఈ సంఘటన జరిగిన కొద్దిసేపటికి సమాచారం అందుకున్న పోలీసులు సిబ్బంది సంఘటన స్థలాన్ని చేరుకొని ఆ కారుని అక్కడి నుంచి తొలగింపజేశారు.

నిరంతరం రద్దీగా ఉన్న రోడ్డుపై ఈ సంఘటన జరగడంతో లక్నోలోని ప్రజలు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి అయ్యారు.

ఈ సంఘటనకు సంబంధించి పూర్తి విచారణ జరుపుతామని ఆ రాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్( State Public Works Department ) తెలిపింది.ఇలా జరగడం రాష్ట్రంలో గడిచిన మూడేళ్లలో ఇది మూడోదని ఆ శాఖ తెలిపింది.ఉత్తరప్రదేశ్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ పిడబ్ల్యూ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించిన తర్వాత ఆ సంఘటనపై ఆన్ సైట్ తనిఖీలు నిర్వహించి కొన్ని వివరాలను సేకరించారు.

ఇందులో భాగంగా ఆ ప్రాంతంలో ఉన్న సీవర్ లైన్ నుండి నిరంతరంగా నీరు లీకేజ్ కావడంతో ఆ రోడ్డు కుంగిపోయినట్లుగా వారు నిర్ధారణకు వచ్చారు.ఆ దెబ్బతిన్న ప్రాంతాన్ని తక్షణ మరమ్మత్తు చేయడం కోసం ఓ ఏజెన్సీకి పనిని అప్పగించారు.

ఏదేమైనా ఈ హఠాత్తు పరిమాణానికి ఎలాంటి ప్రాణహాని కలగకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube