మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్( Mylavaram MLA Vasantha Krishnaprasad ) టీడీపీలో చేరారు.పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ( TDP ) తీర్థం పుచ్చుకున్నారు.
ఈ క్రమంలో వసంత కృష్ణప్రసాద్ కు పార్టీ కండువా కప్పి చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు.అనంతరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రతిపక్ష నేతలను తిడితేనే వైసీపీలో పదవులు వస్తాయని ఆరోపించారు.
మైలవరం టికెట్( Mylavaram Ticket ) ఇస్తామని చెపుతూనే చంద్రబాబును, లోకేశ్ ను వ్యక్తిగతంగా దూషించాలని చెప్పారని ఆరోపణలు చేశారు.అలాగే టీడీపీ నేత దేవినేని ఉమ( Devineni Uma )తో వ్యక్తిగత ద్వేషాలు లేవన్న వసంత కృష్ణప్రసాద్ ఇద్దరం కలిసి కూర్చొని అన్నీ మాట్లాడుకుంటామని తెలిపారు.