వైట్ హెయిర్( White hair ).ఇటీవల కాలంలో చాలా మంది చిన్న వయసులోనే ఈ సమస్యతో బాధపడుతున్నారు.
తెల్ల జుట్టు వృద్ధాప్యానికి సంకేతం.అందుకే తెల్ల జుట్టు వస్తుంది అంటే తెగ టెన్షన్ పడుతూ ఉంటారు.
అయితే తెల్ల జుట్టు వచ్చాక బాధపడడం కన్నా రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలు.మరి నల్ల జుట్టు ఎప్పటికి తెల్లగా మారకుండా ఉండాలి అంటే ఇప్పుడు చెప్పబోయే రెమెడీని మీరు తప్పక ట్రై చేయాల్సిందే.

ఈ రెమెడీ కోసం ముందుగా ఒక చిన్న ఉల్లిపాయను తీసుకుని తొక్క తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మరియు అరకప్పు ఫ్రెష్ అలోవెరా జెల్( Aloe Vera Gel ) వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ ఆనియన్ అలోవెరా జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ కరివేపాకు పొడి, వన్ టేబుల్ స్పూన్ కాఫీ పొడి, వన్ టేబుల్ స్పూన్ మందారం పొడి( Hibiscus Powder ) వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.ముఖ్యంగా కరివేపాకు, కాఫీ పొడి, మందార పొడి, అలోవెరా, ఉల్లి లో ఉండే పోషకాలు జుట్టులో మెలనిన్ ఉత్పత్తిని పెంచుతాయి.
నల్ల జుట్టు తెల్లబడకుండా అడ్డుకట్ట వేస్తాయి. తెల్ల జుట్టుకు దూరంగా ఉండాలని భావించే వారికి ఈ రెమెడీ ఎంతో ఉత్తమం గా సహాయపడుతుంది.
పైగా ఈ రెమెడీని పాటించడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.హెయిర్ బ్రేకేజ్ సమస్య దూరం అవుతుంది.
జుట్టు ఆరోగ్యంగా ఒత్తుగా మారుతుంది.