ప్రస్తుతం ముంబై ఇండియన్స్( Mumbai Indians ) టీమ్ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది.ఇక ఎప్పుడైతే ముంబై యాజమాన్యం రోహిత్ శర్మని( Rohit Sharma ) కెప్టెన్ గా తప్పిస్తూ హార్దిక్ పాండ్యని( Hardik Pandya ) కొత్త కెప్టెన్ గా అనౌన్స్ చేసిందో అప్పటి నుంచి ముంబై ఇండియన్స్ టీమ్ లో చాలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
ఇక రోహిత్ శర్మ అభిమానులు ముంబై ఇండియన్స్ ని ట్విట్టర్ (ఎక్స్), ఇన్ స్టా లో అన్ ఫాలో చేసిన విషయం మనకు తెలిసిందే.దాదాపు 5 లక్షల మంది సోషల్ మీడియా వేదికగా ముంబై టీమ్ ను అన్ ఫాలో చేయడం అనేది ఆ టీం కి భారీ దెబ్బగా మారే అవకాశం కూడా ఉంది.
ఇక ఇప్పుడు ముంబై టీమ్ కి మరో చిక్కు వచ్చి పడింది.హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ లు ఆడడానికి పెద్దగా ఆసక్తి చూపించనట్టుగా తెలుస్తుంది.
ఇక ఇదే టైం లో సూర్య కుమార్ యాదవ్,( Suryakumar Yadav ) జస్ప్రిత్ బుమ్రా లు( Jasprit Bumrah ) రోహిత్ శర్మ తర్వాత టీమ్ పగ్గాలను చేపట్టాలని అనుకున్నారు.కానీ ముంబై యాజమాన్యం హార్దిక్ పాండ్యా ని టీమ్ లోకి తీసుకురావడం పట్ల వాళ్లు తీవ్రమైన అసంతృప్తి తో ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక పాండ్య గత కొద్దిరోజుల నుంచి చీలిమండ గాయంతో ఇబ్బంది పడుతున్నాడు.ఇప్పుడు జరిగే ఈ ఐపిఎల్ 17వ సీజన్ లో( IPL17 ) పాండ్య అందుబాటులో ఉంటాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.ఒకవేళ హార్థిక్ పాండ్యా అందుబాటు లో లేకపోతే రోహిత్ శర్మనే ఈ సీజన్ కి కూడా కెప్టెన్ గా వ్యవహరిస్తాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.నిజానికి ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఈ ఒక్క సీజన్ కి రోహిత్ శర్మని కెప్టెన్ గా కొనసాగించి ఆ తర్వాత సీజన్ నుంచి హార్థిక్ పాండ్య ని కెప్టెన్ గా కంటిన్యూ చేస్తే సరిపోయేది అని మాజీ క్రికెట్ ప్లేయర్లు వాళ్ల అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…

గత రెండు సీజన్ల నుంచి ముంబై ఇండియన్స్ టీం పెద్దగా ఆశించిన ఫలితాన్ని అయితే సాధించలేక పోతుంది.ఇక గత సీజన్ లో ప్లే ఆఫ్ కి వచ్చినప్పటికీ లక్నో టీం పైన గెలిచి ఎలిమినేటర్ మ్యాచులో గుజరాత్ టీం పైన ఓడిపోయింది.ఇక దాంతో ఈ సీజన్ కి టీమ్ లో భారీ మార్పులు చేయాలని భావించిన టీమ్ యాజమాన్యం ముందుగా రోహిత్ ని పక్కన పెట్టాలనే నిర్ణయం తీసుకుంది.
అందువల్లే హార్దిక్ పాండ్యా టీంలోకి వచ్చాడు.మరి ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ టీం పరిస్థితి ఎలా ఉంటుంది అనే దాని పైననే ముంబై టీమ్ భవిష్యత్ కార్యాచరణ అనేది ఆధారపడి ఉంది…







