తెలుగు ప్రేక్షకులకు ఒకప్పటి నటుడు జేడీ చక్రవర్తి( J D Chakravarthy ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.స్టార్ హీరోలకు దీటుగా సినిమాలు చేసి మెప్పించారు.
హీరోగానే కాదు నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసి మెప్పించాడు.పాత్ర కంటే కంటెంట్‌కి ప్రయారిటీ ఇచ్చాడు.
ఇండస్ట్రీలో తనకంటూ ఒక సెపరేట్ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నాడు.అలా ఒకప్పుడు ఎన్నో సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోలకు పోటీగా నిలిచారు.
చాలా గ్యాప్ తర్వాత ఇటీవల దయా( Dayaa ) అనే వెబ్ సిరీస్‌తో మళ్లీ మెయిన్ స్ట్రీమ్‌లోకి వచ్చాడు.ఇకపై రెగ్యూలర్‌గా సినిమాలు చేయబోతున్నట్టు తెలిపారు.

ఇదిలా ఉంటే ఆ సందర్భంగా జేడీ చక్రవర్తి తన గతం గురించి పలు షాకింగ్ విషయాలను పంచుకున్నారు.రాయల్ లైఫ్‌ని అనుభవించిన జేడీ చక్రవర్తి రోడ్డున పడ్డ పరిస్థితి ఎదురయ్యిందని తెలిపారు.తాజాగా జేడీ చక్రవర్తి ఇంటర్వ్యూ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కాగా ఆ వీడియోలో జెడి చక్రవర్తి మాట్లాడుతూ.కాగా జేడీ చక్రవర్తికి హైదరాబాద్( Hyderabad )లో వందల కోట్లు విలువల చేసే వందల ఎకరాలు ఉండేదట.రాజమండ్రిలోనూ వేల ఎకరాల ల్యాండ్ ఉందట.
ఈ విషయాన్ని యాంకర్ ప్రశ్నించారు.మీది చిన్నప్పట్నుంచి గోల్డెన్ స్ఫూన్ అని, డైమండ్ స్ఫూన్ అని కూడా విన్నాను.

గోల్కొండ ఎదురుగా వందల ఎకరాలు జేడీ చక్రవర్తి వాళ్ల ఫాదర్ వి అని, అలాగే రాజమండ్రి( Rajamahendravaram )లోనూ వేల ఎకరాలు ఉండేవని విన్నాను.కానీ మీ ఫాదర్ చనిపోయినప్పుడు మీరు ఎలా ఫీలయ్యారు, దాన్ని చూసుకోవడం బర్డెన్ అయ్యిందా? అని అడగగా జేడీ చక్రవర్తి.నవ్వుతూ ఎక్కడ ఉందో చెబితే తెచ్చుకుంటాను.కొంచెం అడ్రస్ ఇవ్వూ అంటూ రియాక్ట్ అయ్యాడు.అయితే అవి లేవు అని మాత్రం ఆయన్నుంచి సమాధానం రాలేదు.ఈ క్రమంలో అసలు విసయాలను బయటపెట్టాడు జేడీ.
తన 13ఏళ్ల వయసులో నాన్న చనిపోయాడు.దీంతో అమ్మే అంతా చూసుకుంది.
రాత్రి తనతో పడుకున్న నాన్న మార్నింగ్ లేచే సరికి లేకపోవడంతో ఆ బాధ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేను.ఆ వయసులో ఈ బరువు, బాధ్యతలు పెద్దగా తెలియవవు.
పెద్ద కన్‌ఫ్యూజన్‌లో ఉన్నట్టు చెప్పుకొచ్చారు జీడి చక్రవర్తి.అలాగే అప్పట్లో దాదాపు ఒక ఎకరం స్థలంలో ఇళ్లు ఉండేదట.
పనివాళ్లు ఉండేవారట.లగ్జరీ హోమ్ అని, రాయల్ లైఫ్ ఉండేదని, కానీ నాన్న చనిపోయాక అవన్నీ పోయినట్టు చెప్పాడు.
లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ వచ్చేంత వరకు అన్నీ వదులుకుని చిక్కడపల్లిలో ఒక చిన్న ఇంటిలో రెంట్‌కి ఉండాల్సి వచ్చిందట.దాదాపు రెండేళ్లు స్ట్రగుల్ అయ్యామని, అది మాకు గొప్ప లెసన్ అని తెలిపారు.