సూర్యాపేట జిల్లా :జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు సముదాయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ సేవ కేంద్రం, రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టుల ప్రారంభోత్సవానికి విచ్చేసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాదే పోలీసు గౌరవ వందనం స్వీకరించారు.అనంతరం ఆయన వాటిని ప్రారంభించారు.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్,సబ్ జడ్జి జి.శ్రీవాణి,
ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె.సురేష్,అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ జె.ప్రశాంతి స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట హైకోర్టు న్యాయమూర్తులు టి, వినోద్ కుమార్,కె,లక్ష్మణ్, బి,విజయసేన్ రెడ్డి,పుల్ల కార్తీక్,సూర్యాపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోండ్రాల అశోక్,జనరల్ సెక్రెటరీ పోలెబోయిన నర్సయ్య యాదవ్,డిఎస్పీ జి.రవి,న్యాయవాదులు, కోర్టు పోలీస్,కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.