Srikanth Pelli Sandadi : పెళ్లి సందడి సినిమాను శ్రీకాంత్ తో చేయమని చెప్పిన స్టార్ హీరో ఎవరో తెలుసా..?

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అప్పట్లో చేసిన సినిమాలన్నీ పెను సంచలనాలను సృష్టించాయి.వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ హిట్లను కొట్టడమే కాకుండా ఆయా హీరోలకు కెరియర్ లో ది బెస్ట్ సినిమాలు గా నిలిచిపోయే హిట్టు సినిమాలను కూడా అందించాడు.

 Do You Know Who Is The Star Hero Who Asked Srikanth To Do Pelli Sanadi Movie-TeluguStop.com

ముఖ్యంగా బాలయ్య, వెంకటేష్, చిరంజీవి, నాగార్జున లాంటి స్టార్ హీరోలతో వరుస సినిమాలను తీశాడు.అలాగే సీనియర్ ఎన్టీఆర్ తో కూడా చాలా సినిమాలు చేసి మంచి విజయాలను అందుకున్నాడు.

ఇక ఇదిలా ఉంటే ఆయన ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాని చేయాలని అనుకొని పెళ్లి సందడి( Pelli Sandadi Movie ) అనే సినిమా స్టోరీ ని ఎంచుకొని ఈ సినిమాకి పెద్ద హీరోలు కాకుండా చిన్న హీరో అయితే సెట్ అవుతాడనే ఉద్దేశ్యంతో ఒకరోజు అనుకోకుండా చిరంజీవి( Chiranjeevi ) కలిస్తే ఆయనకి ఈ కథ చెప్పాడట.దాంతో చిరంజీవి వెంటనే శ్రీకాంత్ తో( Srikanth ) ఈ సినిమా చేయండి బాగుంటుందని చెప్పడంతో రాఘవేంద్రరావు కూడా ఇంకో ఆలోచన లేకుండా శ్రీకాంత్ కి ఈ కథ చెప్పి ఆయన హీరోగా ఈ సినిమాను తెరకెక్కించాడు.ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా శ్రీకాంత్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.

 Do You Know Who Is The Star Hero Who Asked Srikanth To Do Pelli Sanadi Movie-Sr-TeluguStop.com

అలాగే రాఘవేంద్రరావు కెరీయర్ లో కూడా ది బెస్ట్ సినిమాగా నిలిచిపోయింది.ఇక శ్రీకాంత్ ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో వరుస సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఎదిగాడు.ఇక ఇది ఇలా ఉంటే శ్రీకాంత్ కొడుకుని హీరోగా పెట్టి ఈ సినిమాకి సీక్వెల్ ను కూడా తీశారు.

కానీ ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు.అయినప్పటికీ ఈ సినిమాతోనే హీరోయిన్ శ్రీలీలా తెలుగు తెరకు పరిచయం అయింది…ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా గుర్తింపుపొందుతోంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube