సినిమా ఇండస్ట్రీలో బాలయ్య బాబుకు( Balayya Babu ) ఉన్న అంత ఇంత కాదు.ఆయన చేసిన వరుస సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్లను అందుకున్నాయి.
ఇప్పటికీ హ్యాట్రిక్ హిట్లు తన ఖాతా లో వేసుకున్న బాలయ్య బాబు ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.

ఇక ఈ సినిమా తర్వాత తను వెంటనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరొక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.ఇక ఇదిలా ఉంటే అప్పట్లో బాలయ్య బాబు హీరోగా వచ్చిన సుల్తాన్ సినిమాలో( Sultan Movie ) ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం బాలయ్య మోహన్ బాబు ను( Mohan Babu ) నటించమని అడగగా, మోహన్ బాబు నటించనని చెప్పారట.ఎందుకంటే అంతకుముందు బాలయ్య బాబుని ఒక సినిమాలో మోహన్ బాబు చిన్న గిఫ్ట్ రోల్ లో నటించమంటే తను చేయలేదట.
అది మనసులో పెట్టుకొని మోహన్ బాబు సుల్తాన్ సినిమా లో ఆ క్యారెక్టర్ ను చేయనని చెప్పడట దాంతో ఆ క్యారెక్టర్ ని కృష్ణంరాజు( Krishnam Raju ) చేత చేయించినట్టుగా చాలా వార్తలైతే వచ్చాయి.

ఇక ఆ తర్వాత మళ్లీ బాలయ్య బాబు, మోహన్ బాబు మధ్య గొడవలు ఏమి లేకుండా మళ్లీ కలిసి పోయారు.ఇక మోహన్ బాబు కొడుకు అయిన మంచు మనోజ్ హీరోగా వచ్చిన ఊ కొడతారా ఉలిక్కి పడతారా( Uu Kodathara Ulikki Padathara ) సినిమాలో బాలయ్య బాబు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటించిన విషయం కూడా మనకు తెలిసిందే.ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ బాలయ్య చేసిన క్యారెక్టర్ కి మాత్రం మంచి గుర్తింపు వచ్చింది.
ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం మోహన్ బాబు సినిమాలు ఏమి చేయకుండా ఖాళీ గా ఉంటున్నాడు.బాలయ్య మాత్రం వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీగా తన కెరీర్ ని గడుపుతున్నాడు…
.







