Srikanth Pelli Sandadi : పెళ్లి సందడి సినిమాను శ్రీకాంత్ తో చేయమని చెప్పిన స్టార్ హీరో ఎవరో తెలుసా..?

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అప్పట్లో చేసిన సినిమాలన్నీ పెను సంచలనాలను సృష్టించాయి.వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ హిట్లను కొట్టడమే కాకుండా ఆయా హీరోలకు కెరియర్ లో ది బెస్ట్ సినిమాలు గా నిలిచిపోయే హిట్టు సినిమాలను కూడా అందించాడు.

ముఖ్యంగా బాలయ్య, వెంకటేష్, చిరంజీవి, నాగార్జున లాంటి స్టార్ హీరోలతో వరుస సినిమాలను తీశాడు.

అలాగే సీనియర్ ఎన్టీఆర్ తో కూడా చాలా సినిమాలు చేసి మంచి విజయాలను అందుకున్నాడు.

"""/" / ఇక ఇదిలా ఉంటే ఆయన ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాని చేయాలని అనుకొని పెళ్లి సందడి( Pelli Sandadi Movie ) అనే సినిమా స్టోరీ ని ఎంచుకొని ఈ సినిమాకి పెద్ద హీరోలు కాకుండా చిన్న హీరో అయితే సెట్ అవుతాడనే ఉద్దేశ్యంతో ఒకరోజు అనుకోకుండా చిరంజీవి( Chiranjeevi ) కలిస్తే ఆయనకి ఈ కథ చెప్పాడట.

దాంతో చిరంజీవి వెంటనే శ్రీకాంత్ తో( Srikanth ) ఈ సినిమా చేయండి బాగుంటుందని చెప్పడంతో రాఘవేంద్రరావు కూడా ఇంకో ఆలోచన లేకుండా శ్రీకాంత్ కి ఈ కథ చెప్పి ఆయన హీరోగా ఈ సినిమాను తెరకెక్కించాడు.

ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా శ్రీకాంత్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.

"""/" / అలాగే రాఘవేంద్రరావు కెరీయర్ లో కూడా ది బెస్ట్ సినిమాగా నిలిచిపోయింది.

ఇక శ్రీకాంత్ ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో వరుస సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఎదిగాడు.

ఇక ఇది ఇలా ఉంటే శ్రీకాంత్ కొడుకుని హీరోగా పెట్టి ఈ సినిమాకి సీక్వెల్ ను కూడా తీశారు.

కానీ ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు.అయినప్పటికీ ఈ సినిమాతోనే హీరోయిన్ శ్రీలీలా తెలుగు తెరకు పరిచయం అయింది.

ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా గుర్తింపుపొందుతోంది.

రామ్ చరణ్ భార్య నికర ఆస్తుల లెక్కలివే.. చరణ్ కంటే ఆస్తులు తక్కువే కానీ?